నన్ను కొట్టి
తానేడుస్తోంది
అమ్మ.... నాకంటే
ఎప్పడూ చిన్నపిల్లే !
అని నానీలు మొదలు పెట్టాడు. ఆ భావ ప్రకటన నాకు నచ్చింది. మా అమ్మ నన్ను తిట్టినా ఏడ్చేది. గురజాడ రచించిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మలో వాడిన చంద్దస్సు ముత్యాల సరల్లాంటి మాత్రా ఛందస్సుతో కూడినవీ నానీలు.
సుర్యుడోస్తే
కోడి తోలికూత
అల్లుడోచ్చాడా
ఆఖరికూతే
పట్టణ వాసులకు పల్లెటూరి నేటివిటి తెలియకపోయినా ఈ పుస్తకం చదివితే పల్లెటుల్లో తిరిగినట్లుంటుంది. అన్ని నానీలు ముందు మాటలో రాసేస్తే ఇది కూడా ఒక పుస్తకం అయిపోతుంది. చిన్న వయసునుంచి పల్లెటూరు అతనికి నచ్చింది. అక్కడ పుష్కలంగా దొరికే ప్రాణవాయువు అతన్ని ఆకర్షించింది. రేయింబవళ్ళు అతన్ని తాకింది. ఆ చెరువు, చెట్లు, పాములు, పురుగులు, పుట్రలు, అన్నింటినీ అతను అర్ధం చేసుకొని వాటితో మమేకమై తిరిగాడు. ఆ అనుభవాలన్నీ ఈ పుస్తకంలో ఆవిష్కరిస్తాడు.
కోరివిపెట్టేవారే
లేరిపుడు
అనాధశవాలై పోయాయి
తాటికాయలు
ముగ్గిన తాటిపళ్ళు తాడిచెట్టు నుంచి రాలిపడిపోతే, వాటిని మంటలో కాల్చుకు తినేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎవరూ కాల్చుకు తినకపోవడం వల్ల తలకొరివి కరువైన అనాధ శవాలన్నాడు తాటిపళ్ళని.
పాముకాటుకు
మంత్రగాడున్నాడు
పల్లెలో
లేనిదల్లా మనిషి కాటుకే
పాములున్నాయి, పాముల్లాంటి మనుషులు కూడా ఉన్నారు. పల్లె పోల్యుషన్ లేకుండా ఉంటుంది. పట్టణం పోల్యుషన్ తో ఉంటుంది. అక్కడ, ఇక్కడ ఉన్న మనుషులు మాత్రం ఒకటే. పల్లెలో అలవాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలూ,మూడ నమ్మకాలూ, మనుష్యుల లక్షణాలు. పల్లెకు మాత్రం ఒకే లక్షణం - అది పవిత్రం, ఆరోగ్యకరం, ఆనందకరం. ఇది మాత్రం ఈ రచయిత రక్తంలో జీర్ణించుకుపోయిన లక్షణం.
.... M.S. నారాయణ
భాషాప్రవీణ, సినీ నటుడు,రచయిత, దర్శకుడు.
నన్ను కొట్టి తానేడుస్తోంది అమ్మ.... నాకంటే ఎప్పడూ చిన్నపిల్లే ! అని నానీలు మొదలు పెట్టాడు. ఆ భావ ప్రకటన నాకు నచ్చింది. మా అమ్మ నన్ను తిట్టినా ఏడ్చేది. గురజాడ రచించిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మలో వాడిన చంద్దస్సు ముత్యాల సరల్లాంటి మాత్రా ఛందస్సుతో కూడినవీ నానీలు. సుర్యుడోస్తే కోడి తోలికూత అల్లుడోచ్చాడా ఆఖరికూతే పట్టణ వాసులకు పల్లెటూరి నేటివిటి తెలియకపోయినా ఈ పుస్తకం చదివితే పల్లెటుల్లో తిరిగినట్లుంటుంది. అన్ని నానీలు ముందు మాటలో రాసేస్తే ఇది కూడా ఒక పుస్తకం అయిపోతుంది. చిన్న వయసునుంచి పల్లెటూరు అతనికి నచ్చింది. అక్కడ పుష్కలంగా దొరికే ప్రాణవాయువు అతన్ని ఆకర్షించింది. రేయింబవళ్ళు అతన్ని తాకింది. ఆ చెరువు, చెట్లు, పాములు, పురుగులు, పుట్రలు, అన్నింటినీ అతను అర్ధం చేసుకొని వాటితో మమేకమై తిరిగాడు. ఆ అనుభవాలన్నీ ఈ పుస్తకంలో ఆవిష్కరిస్తాడు. కోరివిపెట్టేవారే లేరిపుడు అనాధశవాలై పోయాయి తాటికాయలు ముగ్గిన తాటిపళ్ళు తాడిచెట్టు నుంచి రాలిపడిపోతే, వాటిని మంటలో కాల్చుకు తినేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎవరూ కాల్చుకు తినకపోవడం వల్ల తలకొరివి కరువైన అనాధ శవాలన్నాడు తాటిపళ్ళని. పాముకాటుకు మంత్రగాడున్నాడు పల్లెలో లేనిదల్లా మనిషి కాటుకే పాములున్నాయి, పాముల్లాంటి మనుషులు కూడా ఉన్నారు. పల్లె పోల్యుషన్ లేకుండా ఉంటుంది. పట్టణం పోల్యుషన్ తో ఉంటుంది. అక్కడ, ఇక్కడ ఉన్న మనుషులు మాత్రం ఒకటే. పల్లెలో అలవాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలూ,మూడ నమ్మకాలూ, మనుష్యుల లక్షణాలు. పల్లెకు మాత్రం ఒకే లక్షణం - అది పవిత్రం, ఆరోగ్యకరం, ఆనందకరం. ఇది మాత్రం ఈ రచయిత రక్తంలో జీర్ణించుకుపోయిన లక్షణం. .... M.S. నారాయణ భాషాప్రవీణ, సినీ నటుడు,రచయిత, దర్శకుడు.
© 2017,www.logili.com All Rights Reserved.