రూయార్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూట ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాటకులను ఇంకా అలరిస్తూనే ఉంది. ఇందులోని కధలన్నీ 1893- 94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాలుగా వెలువడ్డాయి. బాయ్ స్కాట్ వంటి ఎన్నో సంస్థలు వాటిని వినియోగించుకున్నాయి. ప్రధానంగా మోగ్లీ చుట్టూ తిరిగే కొన్ని కధలను ఈ తెలుగు అనువాదంలో పొందుపరచడం జరిగింది.
జంతువులను పాత్రలుగా మలచి నీతిని ప్రభోదించే జానపద కధలవంటివి ఈ కధలు. ఇందులోని పాత్రలు వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు, దైర్య సాహసాలు, సంప్రదాయాలు, ఐకమత్యం,పట్టుదల వంటి విశిష్ట గుణాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. మోగ్లీ తనకు ఎదురైన ప్రమాదాలనుంచి ఎలా బయట పడ్డాడు, కష్టాలను ఎలా అధిగమించాడు, జీవిత వైవిధ్యాన్ని పరమార్ధాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడు వంటి అంశాలను క్లిపింగ్ ఈ కధల ద్వారా వివరిస్తాడు.ఇందులోని జంతు పాత్రలు, మనవ పాత్రలు అడవిలోని, మనవ సమాజంలోని మంచి చెడ్డల పట్ల అవగాహన కల్పించేందుకు, స్వీయ విలువలను, మంచిని పెంపొందించేందుకు దోహదపడతాయి. జంతువుల్లో చక్కని క్రమబద్దత, తెలివితేటలూ, విలువలు కొట్టోచ్చినట్లు కనిపిస్తాయి.
క్లిపింగ్ కధనంలో పందొమ్మిదవ శతాబ్దపు ప్రకృతి చిత్రణ విధానం వుంటుంది. మానవుల నియమాలకంటే ప్రకృతి నియమాలే ఎంతో ఉన్నతమైనవి అని చాటడం కనిపిస్తుంది. అడవిలో అజ్ఞానం, హింస కొంత ఎక్కువగా వున్నప్పటికీ మంచి చెడు తెలిసిన, దేనికైనా ఎన్నుకునే స్వేచ్చ వున్న మనవ సమాజంలో వాటి పరిస్థితి మరీ దారుణం అంటాడు. ఈ కధలు అడవిలో కాటగలసిపోయిన ఒక పసివాడికి, మాట్లాడే జంతువులతో అతనికి ఏర్పడ్డ స్నేహానికి సంబందించిన కధలుగా పైకి అనిపిస్తాయి. కానీ ఎంతటి సమస్యలనైనా ఎలా ఎదుర్కోవాలో, స్నేహం ఎంత విలువైనదో చాటి చెప్పడమే వీటి ప్రధాన లక్ష్యం.
జంతువులు అడవిలో ఉంటాయి. మనుషులు ఊర్లో ఉంటారు. ఇది ఒకప్పుడు నిజం, ఇప్పుడు కొంతవరకు అబద్ధం. ఊర్లో ఉండే మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తుంటే, అడవిలో ఉండే జంతువులు మనుషుల కంటే ఉన్నతంగా ప్రవర్తించడం ఈ జంగిల్ బుక్ కథల్లో మనకు కనిపిస్తుంది. దాదాపు ఏడెనిమిది దశాబ్దాల క్రితం రుడ్యార్డ్ క్లిపింగ్ రాసిన ఈ కథలు ఇప్పటికీ ఆదరణకు నోచుకుంటున్నాయంటే మనుషులకు జంతువులు మానవత్వంతో మెలగాలనే కోరిక ఇప్పటికీ అంతే బలంగా ఉన్నట్టుంది. ఎంత బలమైన జంతువైనా అడవిలోని పరాయి ప్రదేశాల్లో వేటాడాలనుకుంటే, ముందుగా ఆ ప్రాంతంలోని జంతువుల అనుమతి తీసుకోవాలట. లేదంటే, ఆ జంతువులన్నీ ఐకమత్యంగా కొత్త జంతువుపై దాడి చేసి చంపేస్తాయి.
అంతేకాదు, ఆ కొత్త జం తువు కేవలం ఆకలి తీర్చుకోవడం కోసమే వేటాడాలి. వినోదం కోసమో, విలాసం కోసమో, పగతోనే వేటాడాలనుకుంటే అడవి జంతువులు ఏమాత్రం కనికరించవు. ఇలాంటి కొన్ని నియమాలు మానవ సమాజంలోనూ ఉంటే ఎంతో బావుండుననిపిస్తుంది. చాలా తెలుగు కథల్లోలా చివర్లో నీతి సూత్రం చెప్పడం కోసం కథ నడిపినట్టుగా కాకుండా నీతిని కథలోనే ఇమిడ్చి ఆసక్తికరంగా కథను మలచడం ఈ 'మొగ్లీ' కథల్లో కనిపిస్తుంది. కార్టూన్స్ ద్వారా బాగా పరిచయం ఉన్నందువల్లే కాకుండా, ప్రభాకర్ అనువాద ప్రతిభ కూడా తోడవ్వడంతో ఇవి అనువాద కథల్లాగాక అలవోకగా, హాయిగా సాగిపోతాయి.
Good Book
i already read in english Good Book
© 2017,www.logili.com All Rights Reserved.