సామాజిక ధర్మములు దేశకాలోచితములుగా మారుతూ ఉండకపోవడము వల్ల జీవనము దుర్భరమయి, జనులు ధర్మశాస్త్రములను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. కొందరు తెగించి బహిరంగముగాను, అనేకమంది రహస్యముగాను. ధర్మాదికారులు రహస్యోల్లంఘనము చూసి చూడనట్లు ఉపేక్షిస్తున్నారు. బహిరంగముగా తమ్మెదిరించినవారిని దండిస్తున్నారు. అధికారులు వివేకముగలవారయితే, ప్రజల సౌఖ్యమునకు ప్రతికూలమయిన నిర్బంధములు తొలగించి, తమ గౌరవమును అధికారమును నిలబెట్టుకుంటారు. అవివేకులయితే, పరాభూతులయి ప్రళయకారకులు అవుతున్నారు.
మనుష్య సంఘము పశువులమంద కాదు. గొడ్లవాడు తన ఇష్టము చప్పున పశువులను తోలినట్లు రాజుగాని రాజ్యాధికార్లు గాని నిరంకుశముగా జనులను ఈ కాలములో పాలించలేరు. ఇతరుల స్వేచ్చా స్వాతంత్రములు కలిగి తన సౌఖ్యమునకు అనుకూలముగా తాను వర్తించుటకు హక్కు గలదన్న అభిప్రాయము నవనాగరీకులలో వ్యాపిస్తున్నది.
- గిడుగు వెంకట రామమూర్తి
సామాజిక ధర్మములు దేశకాలోచితములుగా మారుతూ ఉండకపోవడము వల్ల జీవనము దుర్భరమయి, జనులు ధర్మశాస్త్రములను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. కొందరు తెగించి బహిరంగముగాను, అనేకమంది రహస్యముగాను. ధర్మాదికారులు రహస్యోల్లంఘనము చూసి చూడనట్లు ఉపేక్షిస్తున్నారు. బహిరంగముగా తమ్మెదిరించినవారిని దండిస్తున్నారు. అధికారులు వివేకముగలవారయితే, ప్రజల సౌఖ్యమునకు ప్రతికూలమయిన నిర్బంధములు తొలగించి, తమ గౌరవమును అధికారమును నిలబెట్టుకుంటారు. అవివేకులయితే, పరాభూతులయి ప్రళయకారకులు అవుతున్నారు. మనుష్య సంఘము పశువులమంద కాదు. గొడ్లవాడు తన ఇష్టము చప్పున పశువులను తోలినట్లు రాజుగాని రాజ్యాధికార్లు గాని నిరంకుశముగా జనులను ఈ కాలములో పాలించలేరు. ఇతరుల స్వేచ్చా స్వాతంత్రములు కలిగి తన సౌఖ్యమునకు అనుకూలముగా తాను వర్తించుటకు హక్కు గలదన్న అభిప్రాయము నవనాగరీకులలో వ్యాపిస్తున్నది. - గిడుగు వెంకట రామమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.