నాటకం లేదా సినిమా కధారచయిత తన రచనా లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు వివిధ లక్ష్య లక్షణాలతో, వివిధ పరిస్థితులలో, వివిధ వ్యక్తులతో పాత్రలను స్పష్టించగా, ఆయా పాత్రలను పోషించే నటులు తమదికాని జీవితాన్ని అనుభవిస్తున్నట్లు అభినయిస్తూ తమలో వివిధ భావోద్వేగాలు కలుగుతున్నట్లుగా ప్రేక్షకుల్ని భ్రమింపజేస్తూ వారికి రసానుభూతిని కలిగిస్తారు. ఈ విధంగా నటించడం ఓ అద్భుతమైన కళ.
అందరినీ ఆనదింపజేసే నటనా కళని నేర్చుకోవాలనీ, ప్రదర్శించాలనీ ఎందరికో ఉంటుంది. పుట్టుకతోనే ఎవరూ గొప్ప నటులు కాలేరు. కానీ అధ్యయనం, శిక్షణా, అభ్యాసం ద్వారా ఆసక్తి గల ఎవరైనా నటులు కాగలరు. అటువంటి వారికి మార్గదర్శిగా వ్యవహరించే నిమిత్తం....
నటనాకళకీ సంబంధించిన దశ రూపాలు, శైలులు, మాధ్యమాలు, దృక్పధాలు, చతుర్విధాభినయాలు, భావములు, నవరసములు, అష్టవిధనాయికలు, నాయకులు మొదలైన శాస్త్రసంబధిత విషయాలతో పాటు, నటనలో పంచేంద్రియాల పాత్ర, నటుని లక్షణాలు, బలహీనతలు, భావోద్వేగ ప్రజ్ఞ, నటశిక్షణాంశాలు, సద్యోనటన, మూకాభినయం, ఏకపాత్రాభినయం తదితర అభ్యాసాంశాలు; స్వయం విశ్లేషణ, పాత్రవిశ్లేషణ, మనోరూపకల్పన, రంగస్థల వ్యాపారము, పాత్రపోషణ, రంగస్థలావ గాహన, నట శిక్షణాసంస్థల ఆవశ్యకత, సమాచారము, రూపశిల్పము, అవార్డులు, చతుష్పష్టికళలు మరియూ ఆడిషన్స్ నిమిత్తం వివిధ అభ్యాసాలతో, నటశాస్త్ర అధ్యయనాభిలాషులకు ప్రాధమిక అవగాహన కలిగించే విజ్ఞాన గ్రంథం ఈ నటనాకళ.
- నాగేంద్రకుమార్ వేపూరి
నాటకం లేదా సినిమా కధారచయిత తన రచనా లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు వివిధ లక్ష్య లక్షణాలతో, వివిధ పరిస్థితులలో, వివిధ వ్యక్తులతో పాత్రలను స్పష్టించగా, ఆయా పాత్రలను పోషించే నటులు తమదికాని జీవితాన్ని అనుభవిస్తున్నట్లు అభినయిస్తూ తమలో వివిధ భావోద్వేగాలు కలుగుతున్నట్లుగా ప్రేక్షకుల్ని భ్రమింపజేస్తూ వారికి రసానుభూతిని కలిగిస్తారు. ఈ విధంగా నటించడం ఓ అద్భుతమైన కళ. అందరినీ ఆనదింపజేసే నటనా కళని నేర్చుకోవాలనీ, ప్రదర్శించాలనీ ఎందరికో ఉంటుంది. పుట్టుకతోనే ఎవరూ గొప్ప నటులు కాలేరు. కానీ అధ్యయనం, శిక్షణా, అభ్యాసం ద్వారా ఆసక్తి గల ఎవరైనా నటులు కాగలరు. అటువంటి వారికి మార్గదర్శిగా వ్యవహరించే నిమిత్తం.... నటనాకళకీ సంబంధించిన దశ రూపాలు, శైలులు, మాధ్యమాలు, దృక్పధాలు, చతుర్విధాభినయాలు, భావములు, నవరసములు, అష్టవిధనాయికలు, నాయకులు మొదలైన శాస్త్రసంబధిత విషయాలతో పాటు, నటనలో పంచేంద్రియాల పాత్ర, నటుని లక్షణాలు, బలహీనతలు, భావోద్వేగ ప్రజ్ఞ, నటశిక్షణాంశాలు, సద్యోనటన, మూకాభినయం, ఏకపాత్రాభినయం తదితర అభ్యాసాంశాలు; స్వయం విశ్లేషణ, పాత్రవిశ్లేషణ, మనోరూపకల్పన, రంగస్థల వ్యాపారము, పాత్రపోషణ, రంగస్థలావ గాహన, నట శిక్షణాసంస్థల ఆవశ్యకత, సమాచారము, రూపశిల్పము, అవార్డులు, చతుష్పష్టికళలు మరియూ ఆడిషన్స్ నిమిత్తం వివిధ అభ్యాసాలతో, నటశాస్త్ర అధ్యయనాభిలాషులకు ప్రాధమిక అవగాహన కలిగించే విజ్ఞాన గ్రంథం ఈ నటనాకళ. - నాగేంద్రకుమార్ వేపూరి© 2017,www.logili.com All Rights Reserved.