ఈ సంక్షిప్తానువాదాన్ని చదివి -
ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజలకు ముప్పులుగా
ఎలా పరిణమిస్తాయో తెలుసుకోగలిగితే -
ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు ఎవరికి వాళ్ళు
తుడిచేసుకు తిరిగితే వచ్చే దుష్ఫలితాలను గమనించగలిగితే -
యుద్ధోన్మాదపు ప్రమధాలనూ శాంతియుత జీవనంలోని
ప్రయోజనాలనూ గుర్తించగలిగితే -
నియంతృత్వపు పోకడలలోని కర్కశత్వాన్నీ, ప్రజాస్వామిక
విలువల్లోని గొప్పతనాన్నీ అవగాహన చేసుకోగలిగితే
1486 పేజీలున్న మూల గ్రంధాన్నుండి ఇలా సంక్షిప్తంగా
సారాన్ని వడకట్టడంలో నా కృషి ఫలించినట్లే.
-రావెల సాంబశివరావు
ఈ పుస్తకం చదవడం ఆసక్తికరమైన అనుభవం. అయితే గత చరిత్ర గనక మొదట కొంత భాగం ఓపిగ్గా కొనసాగించాలి. జర్మినీ ఏర్పాటులో వివిధ విభాగాల ప్రత్యేక లక్షణాలు, అకారణంగా కయ్యానికి కాలుదువ్వి శృంగభంగం పాలైన ఫలితాలు, ఈ రాజకీయ ఆర్దిక సంక్షోభాల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని హిట్లర్ వంటి వారు సొమ్ము చేసుకోవడం నాటకీయమైన రీతిలో సాగుతాయి. కమ్యూనిస్టు శక్తులు జర్మినీలో ఒక ప్రత్యామ్నాయంగా రావడాన్ని నిరోధించాలనే కుట్ర కూడా ధీని వెనక వుంది. అస్తవ్యస్త పరిస్థితులు అవకాశవాద ధోరణులను ఎలా ఎగదోస్తాయనే పాఠం కూడా వుంది . ఆనాటి పేర్లు వెంటనే గుర్తుంచుకోవడం కష్టంగా అనిపించినా ఈ ప్రాధమిక అంశాలు జ్ఞాపకం వుంచుకుంటే పుస్తకం ఆసక్తిగా సాగిపోతుంది.
ఈ సంక్షిప్తానువాదాన్ని చదివి - ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజలకు ముప్పులుగా ఎలా పరిణమిస్తాయో తెలుసుకోగలిగితే - ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు ఎవరికి వాళ్ళు తుడిచేసుకు తిరిగితే వచ్చే దుష్ఫలితాలను గమనించగలిగితే - యుద్ధోన్మాదపు ప్రమధాలనూ శాంతియుత జీవనంలోని ప్రయోజనాలనూ గుర్తించగలిగితే - నియంతృత్వపు పోకడలలోని కర్కశత్వాన్నీ, ప్రజాస్వామిక విలువల్లోని గొప్పతనాన్నీ అవగాహన చేసుకోగలిగితే 1486 పేజీలున్న మూల గ్రంధాన్నుండి ఇలా సంక్షిప్తంగా సారాన్ని వడకట్టడంలో నా కృషి ఫలించినట్లే. -రావెల సాంబశివరావు ఈ పుస్తకం చదవడం ఆసక్తికరమైన అనుభవం. అయితే గత చరిత్ర గనక మొదట కొంత భాగం ఓపిగ్గా కొనసాగించాలి. జర్మినీ ఏర్పాటులో వివిధ విభాగాల ప్రత్యేక లక్షణాలు, అకారణంగా కయ్యానికి కాలుదువ్వి శృంగభంగం పాలైన ఫలితాలు, ఈ రాజకీయ ఆర్దిక సంక్షోభాల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని హిట్లర్ వంటి వారు సొమ్ము చేసుకోవడం నాటకీయమైన రీతిలో సాగుతాయి. కమ్యూనిస్టు శక్తులు జర్మినీలో ఒక ప్రత్యామ్నాయంగా రావడాన్ని నిరోధించాలనే కుట్ర కూడా ధీని వెనక వుంది. అస్తవ్యస్త పరిస్థితులు అవకాశవాద ధోరణులను ఎలా ఎగదోస్తాయనే పాఠం కూడా వుంది . ఆనాటి పేర్లు వెంటనే గుర్తుంచుకోవడం కష్టంగా అనిపించినా ఈ ప్రాధమిక అంశాలు జ్ఞాపకం వుంచుకుంటే పుస్తకం ఆసక్తిగా సాగిపోతుంది.Naaji
© 2017,www.logili.com All Rights Reserved.