పల్నాటి వీరచరిత్రను మంజరీ ద్విపదలో వ్రాసిన కవులు ముగ్గురు. అందులో బాలచంద్రుని యుద్దభాగాన్ని శ్రీనాధుడు వ్రాయగా, తక్కిన భాగాలు కొండయ్య,మల్లయ్య పేరిట ఉన్నాయి. ఈ కధ జరిగి 850(క్రీ.శ.1160 లో పలనాటి యుద్ధం జరిగింది.) సంవత్సరాలు కావస్తున్నా,ఇది జానపదులకు చేరువైనంతగా, చాలాకాలంగా విద్యావంతులకు చేరువ కాలేదు. ఆ చేరువయ్యే పనిని శ్రీ నాధులు కొంత చేసారు. కానీ ఈ నాటి వరకు ఆ కధ యొక్క ఆనుపానులు అమూలగ్రంగా తెలిసిన వారు చదువరులలో తక్కువే. ఎందుకంటే, ఇది కవితా రూపంలో ఉండడమే అందుకు కారణం. మంజరి ద్విపదలో సులభశైలి నడిచినప్పటికీ, ఆ వృత్తాంతాన్ని తెలిసికోనదగిన వారి కేందరికో అది ఇంకా అందకుండానే ఉండిపోయింది. ఆ గాధ సర్వజనులకు తెలిసేటట్లుగా వచన రూపంలో సమగ్రసుందరంగా రచించి, తెలుగు ప్రజల కందించిన ఘనత ఇంతకాలానికి బాలగంగాధరరావు గారికి దక్కింది. రావు గారి శైలి సరళ సుందరంగా ఉంది. అందరకు అర్ధమవుతుంది. పుస్తకాన్ని చదివిస్తుంది. రక్తి గొలుపుతుంది. విరామం లేకుండా చదవాలనే ఉత్కంఠ కలిగిస్తుంది.
........ ఆచార్య వి.రామచంద్ర చౌదరి
పల్నాటి వీరచరిత్రను మంజరీ ద్విపదలో వ్రాసిన కవులు ముగ్గురు. అందులో బాలచంద్రుని యుద్దభాగాన్ని శ్రీనాధుడు వ్రాయగా, తక్కిన భాగాలు కొండయ్య,మల్లయ్య పేరిట ఉన్నాయి. ఈ కధ జరిగి 850(క్రీ.శ.1160 లో పలనాటి యుద్ధం జరిగింది.) సంవత్సరాలు కావస్తున్నా,ఇది జానపదులకు చేరువైనంతగా, చాలాకాలంగా విద్యావంతులకు చేరువ కాలేదు. ఆ చేరువయ్యే పనిని శ్రీ నాధులు కొంత చేసారు. కానీ ఈ నాటి వరకు ఆ కధ యొక్క ఆనుపానులు అమూలగ్రంగా తెలిసిన వారు చదువరులలో తక్కువే. ఎందుకంటే, ఇది కవితా రూపంలో ఉండడమే అందుకు కారణం. మంజరి ద్విపదలో సులభశైలి నడిచినప్పటికీ, ఆ వృత్తాంతాన్ని తెలిసికోనదగిన వారి కేందరికో అది ఇంకా అందకుండానే ఉండిపోయింది. ఆ గాధ సర్వజనులకు తెలిసేటట్లుగా వచన రూపంలో సమగ్రసుందరంగా రచించి, తెలుగు ప్రజల కందించిన ఘనత ఇంతకాలానికి బాలగంగాధరరావు గారికి దక్కింది. రావు గారి శైలి సరళ సుందరంగా ఉంది. అందరకు అర్ధమవుతుంది. పుస్తకాన్ని చదివిస్తుంది. రక్తి గొలుపుతుంది. విరామం లేకుండా చదవాలనే ఉత్కంఠ కలిగిస్తుంది. ........ ఆచార్య వి.రామచంద్ర చౌదరిYou have one copy
© 2017,www.logili.com All Rights Reserved.