మంచి మాట,మంచిపని మాత్రేమే మన జ్ఞాపక చిహ్నాలు. మనం చేస్తున్న పనులకు మనం సమాధానం ఇచ్చుకోవలిసిన రోజు వచ్చి తీరుతుందనే విషయం జ్ఞాపకం వున్నంతకాలం, ఒళ్ళు దగ్గర పెట్టుకునే నడుస్తాము, ఇరవై నుండి అరవైకైనా, ఆపైకైనా. చరిత్రలో ఒక పేజికోసం కాదు, ఒక మాటు మనల్ని తలుచుకుండే వాడెవడైనా ఉండాలనే ఈ ఆరాటం.
నలుగురూ మెచ్చేటట్లుగా జ్ఞాపకం ఉంచుకునేలా జీవించడం ఒక యోగసాధన లాంటిది. వయసుతో నిమిత్తం లేకుండా జీవితాన్ని అర్ధం చేసుకోవడం కోసం ఈ ప్రస్తావన. ఈ ప్రయత్నం అందరికీ నచ్చాలనే కోరికతోనే సకుటుంబ పఠనావశ్యకముగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నా. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవారే ముక్త జివనులు, చిరస్మరణీయులు.
- పసుమర్తి వేణుగోపాలరావు
కార్యసాధకుని వ్యక్తిత్వం, స్నేహ బాంధవ్యాల మధురిమ, ప్రేమలోని ఆనందం, జీవితానుబంధాలలోని అన్యోన్యత, కుటుంబ వ్యవస్థలో అవసరమైన పారస్పర్యం, బాధ్యతలూ, వెలుగునీడల సయ్యాట నుండి, యోగిలా మహాప్రస్థానానికి సిద్ధపడడానికి, సంసారశాస్త్ర పరిణితులను చేయడానికి కంకణం కట్టుకుని, సుఖదుఃఖాల కతీతమైన సాధకరహస్యాలను ఎంత చక్కగా విశదికరించవయ్యా - సంతోషం.
లోకానుభవం, సద్గ్రంధపఠనం, సాంకేతిక శాస్త్రాచార్యకత్వం, రచనా పాటవం, ఇంత సరుకూ, సరంజామా ఉండబట్టే, స్పష్టమైన ఆలోచన, సులభమైన భాష, చదువరులకు ఉపయోగించాలనే తపనతో ఇన్ని మంచి గుణాలున్న పుస్తకం వ్రాశావు.
ఇక నుంచి జీవిత ప్రాంగణంలో అడుగుపెడుతున్న శుభ తరుణాన, నూతన వధూవరులకు నీ పుస్తకం బహుకరిస్తాను.
- డా. ధారా రామనాధశాస్త్రి
నాట్యావధాన కళాస్ట్రష్ట
జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను విశ్లేషిస్తూ, సంతోషంగా జీవించడానికి చక్కటి సూచనలను, సలహాలను, సుత్రాల్లా, క్రోడీకరించిన ఆణిముత్యాల్లాంటి అర్ధవంతమైన వాక్యాలతో, quote చేసుకోదగ్గ నిర్వచనాలతో నింపి, ఏకబిగిన చదివింపగల విశిష్ట రచన - 'హాయిగా జీవించండి'
అరవై దాటిన నాకే ఇలాంటి పుస్తకం ఇరవైలోనో, నలబైలోనో దొరికి ఉంటే - జీవితాన్ని ఇంకొంచెం అందంగా చక్కదిద్దుకునే దాన్నేమోననిపించింది. లౌకిక పరమార్ధాలను అందరికీ అర్ధమయ్యేలాగా వ్రాశారు.
- శ్రీమతి భార్గవీరావు
కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
మంచి మాట,మంచిపని మాత్రేమే మన జ్ఞాపక చిహ్నాలు. మనం చేస్తున్న పనులకు మనం సమాధానం ఇచ్చుకోవలిసిన రోజు వచ్చి తీరుతుందనే విషయం జ్ఞాపకం వున్నంతకాలం, ఒళ్ళు దగ్గర పెట్టుకునే నడుస్తాము, ఇరవై నుండి అరవైకైనా, ఆపైకైనా. చరిత్రలో ఒక పేజికోసం కాదు, ఒక మాటు మనల్ని తలుచుకుండే వాడెవడైనా ఉండాలనే ఈ ఆరాటం. నలుగురూ మెచ్చేటట్లుగా జ్ఞాపకం ఉంచుకునేలా జీవించడం ఒక యోగసాధన లాంటిది. వయసుతో నిమిత్తం లేకుండా జీవితాన్ని అర్ధం చేసుకోవడం కోసం ఈ ప్రస్తావన. ఈ ప్రయత్నం అందరికీ నచ్చాలనే కోరికతోనే సకుటుంబ పఠనావశ్యకముగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నా. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవారే ముక్త జివనులు, చిరస్మరణీయులు. - పసుమర్తి వేణుగోపాలరావు కార్యసాధకుని వ్యక్తిత్వం, స్నేహ బాంధవ్యాల మధురిమ, ప్రేమలోని ఆనందం, జీవితానుబంధాలలోని అన్యోన్యత, కుటుంబ వ్యవస్థలో అవసరమైన పారస్పర్యం, బాధ్యతలూ, వెలుగునీడల సయ్యాట నుండి, యోగిలా మహాప్రస్థానానికి సిద్ధపడడానికి, సంసారశాస్త్ర పరిణితులను చేయడానికి కంకణం కట్టుకుని, సుఖదుఃఖాల కతీతమైన సాధకరహస్యాలను ఎంత చక్కగా విశదికరించవయ్యా - సంతోషం. లోకానుభవం, సద్గ్రంధపఠనం, సాంకేతిక శాస్త్రాచార్యకత్వం, రచనా పాటవం, ఇంత సరుకూ, సరంజామా ఉండబట్టే, స్పష్టమైన ఆలోచన, సులభమైన భాష, చదువరులకు ఉపయోగించాలనే తపనతో ఇన్ని మంచి గుణాలున్న పుస్తకం వ్రాశావు. ఇక నుంచి జీవిత ప్రాంగణంలో అడుగుపెడుతున్న శుభ తరుణాన, నూతన వధూవరులకు నీ పుస్తకం బహుకరిస్తాను. - డా. ధారా రామనాధశాస్త్రి నాట్యావధాన కళాస్ట్రష్ట జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను విశ్లేషిస్తూ, సంతోషంగా జీవించడానికి చక్కటి సూచనలను, సలహాలను, సుత్రాల్లా, క్రోడీకరించిన ఆణిముత్యాల్లాంటి అర్ధవంతమైన వాక్యాలతో, quote చేసుకోదగ్గ నిర్వచనాలతో నింపి, ఏకబిగిన చదివింపగల విశిష్ట రచన - 'హాయిగా జీవించండి' అరవై దాటిన నాకే ఇలాంటి పుస్తకం ఇరవైలోనో, నలబైలోనో దొరికి ఉంటే - జీవితాన్ని ఇంకొంచెం అందంగా చక్కదిద్దుకునే దాన్నేమోననిపించింది. లౌకిక పరమార్ధాలను అందరికీ అర్ధమయ్యేలాగా వ్రాశారు. - శ్రీమతి భార్గవీరావు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత© 2017,www.logili.com All Rights Reserved.