సంప్రదాయ బద్ధమైన ఆస్తి సంక్రమణానికి పూర్తి విరుద్ధం వీలునామా పూర్వక ఆస్తి సంక్రమణం. సంప్రదాయ బద్ధమైన ఆస్తి సంక్రమణం అంటే వ్యక్తిగత మత విశ్వాసాలను అనుసరించి, ఒక వ్యక్తి యొక్క ఆస్తి, అతని తదనంతరం అతని వారసులకు సంక్రమించటం. సంప్రదాయబద్ధ ఆస్తి సంక్రమణం విషయంలో ఆ వ్యక్తి యొక్క ఇష్టాఇష్టాలతో పనిలేదు. అయితే, చాలా సందర్భాలలో, చాలా మంది తన ఆస్తి తన తదనంతరం తన ఇష్టానుసారం, తనకు నచ్చిన వారికి సంక్రమించాలని కోరుకుంటారు. లేకే ఏ దేవాలయానికో, స్వచ్చంద సంస్థకో సంక్రమించాలని కోరుకుంటారు. లేక ఏ ధర్మ కార్యానికో, ప్రజాహిత కార్యక్రమానికో, విద్యాలయాల నిర్మాణానికో, వృద్ధుల, వికలాంగుల, అనాధల సంక్షేమానికో వినియోగించబడాలని కోరుకుంటారు.
ఇందుకు ఉన్న ఏకైక సులువైన మార్గం వీలునామా. అదే సమయంలో మనుషుల ఆలోచనలు మారుతుంటాయి. తదనుగుణంగా, తన ఆస్తి ఒక విధంగా వియోగింపబడాలని, లేక ఒక వ్యక్తి లేక సంస్థకు సంక్రమించాలని ఒక నాడు భావించిన వ్యక్తి, ఆ తర్వాత తన ఆస్తి మరొక విధంగా వినియోగింపబడాలని, లేక మరొక వ్యక్తి లేక సంస్థకు సంక్రమించాలని మరొక రోజు భావించవచ్చు. అందుకూ వీలునామా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి ఒక వీలునామాను వ్రాసిన తరువాత, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఆ వీలునామాను పూర్తిగాగాని లేక పాక్షికంగా గాని రద్దు చేసుకొని కొత్త వీలునామా వ్రాసుకోవచ్చు. వీలునామాకు ఉన్న సౌలభ్యము, విశిష్టత, ప్రత్యేకత ఇదే. అందుకే ఈ పుస్తకానికి 'నా ఆస్తి- నా ఇష్టం' అని ఉప శీర్షిక ఇవ్వబడింది. వీలునామాలు వ్రాయటంలో తెలుగు పాఠకులకు ఒక సమగ్ర అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని వ్రాయటం జరిగింది.
- పెండ్యాల సత్యనారాయణ
సంప్రదాయ బద్ధమైన ఆస్తి సంక్రమణానికి పూర్తి విరుద్ధం వీలునామా పూర్వక ఆస్తి సంక్రమణం. సంప్రదాయ బద్ధమైన ఆస్తి సంక్రమణం అంటే వ్యక్తిగత మత విశ్వాసాలను అనుసరించి, ఒక వ్యక్తి యొక్క ఆస్తి, అతని తదనంతరం అతని వారసులకు సంక్రమించటం. సంప్రదాయబద్ధ ఆస్తి సంక్రమణం విషయంలో ఆ వ్యక్తి యొక్క ఇష్టాఇష్టాలతో పనిలేదు. అయితే, చాలా సందర్భాలలో, చాలా మంది తన ఆస్తి తన తదనంతరం తన ఇష్టానుసారం, తనకు నచ్చిన వారికి సంక్రమించాలని కోరుకుంటారు. లేకే ఏ దేవాలయానికో, స్వచ్చంద సంస్థకో సంక్రమించాలని కోరుకుంటారు. లేక ఏ ధర్మ కార్యానికో, ప్రజాహిత కార్యక్రమానికో, విద్యాలయాల నిర్మాణానికో, వృద్ధుల, వికలాంగుల, అనాధల సంక్షేమానికో వినియోగించబడాలని కోరుకుంటారు. ఇందుకు ఉన్న ఏకైక సులువైన మార్గం వీలునామా. అదే సమయంలో మనుషుల ఆలోచనలు మారుతుంటాయి. తదనుగుణంగా, తన ఆస్తి ఒక విధంగా వియోగింపబడాలని, లేక ఒక వ్యక్తి లేక సంస్థకు సంక్రమించాలని ఒక నాడు భావించిన వ్యక్తి, ఆ తర్వాత తన ఆస్తి మరొక విధంగా వినియోగింపబడాలని, లేక మరొక వ్యక్తి లేక సంస్థకు సంక్రమించాలని మరొక రోజు భావించవచ్చు. అందుకూ వీలునామా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి ఒక వీలునామాను వ్రాసిన తరువాత, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఆ వీలునామాను పూర్తిగాగాని లేక పాక్షికంగా గాని రద్దు చేసుకొని కొత్త వీలునామా వ్రాసుకోవచ్చు. వీలునామాకు ఉన్న సౌలభ్యము, విశిష్టత, ప్రత్యేకత ఇదే. అందుకే ఈ పుస్తకానికి 'నా ఆస్తి- నా ఇష్టం' అని ఉప శీర్షిక ఇవ్వబడింది. వీలునామాలు వ్రాయటంలో తెలుగు పాఠకులకు ఒక సమగ్ర అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని వ్రాయటం జరిగింది. - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.