ఒకరోజు ఉదయం చైతన్యరథంలో నేను ఒక విషయాన్ని చాలా సీరియస్‌గా ముందుకు వంగి ఎన్‌టిఆర్‌తో
చెపుతున్నప్పుడు నన్ను నిశితంగా చూస్తూ ఆ విషయాన్ని వదిలేసి ”యూ ఆర్ ఎ పోలీసు ఆఫీసర్, నిటారుగా కూర్చొని
చెప్పండి” అన్నారు. నేను షాక్ తిన్నాను. నా పరిస్థితిని గమనించి తేలిగ్గా నవ్వుతూ ”ఎస్.పోలీస్ మాన్ ఈజ్ ఆల్‌వేస్ ఏ
పోలీస్‌మాన్” అని భుజం తట్టారు.