పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకోనిన న్యాయవాదులను జేర్చుకోనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యేములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచ్చున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. పెరుగుచున్న నేరములు పెరుగుచునే యున్నవి. కట్టించుచున్న కారాగృహములను గట్టించుచునే యున్నారు. ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య యెదుగుచునే యున్నది. నరహత్య చేసినవారిని జంపుటకు నానావిధ యంత్రములు కల్పించుచునే యున్నారు. హత్యలు వృద్ధియగుచునేయున్నవి.
సర్వకాల సర్వావస్థల్లోనూ సంఘంలో దోషాలుంటాయి. ఉత్తములు ఆ దోషాలను చూసి బాధపడుతూ వుంటారు. వాటిని విమర్శిస్తుంటారు. దిద్దే ప్రయత్నం చేస్తుంటారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని సామెత. పరుష వాక్యంతో మనుషులు మారతారని ఆశ. రచయితలు సంఘ విమర్శ ద్వారా సంస్కరణ కోసం ప్రయత్నిస్తారు. అటువంటి ప్రయత్నాలలో 'సాక్షి' వ్యాసాల రచన ఒకటి.
పానుగంటి లక్ష్మినరసింహారావుగారు(1865 - 1940) ఆంధ్రా ఎడిసన్, ఆంధ్రా షేక్స్పియర్, అభినవ కాళిదాసు బిరుదాంకితులు. మొదటి బిరుదుంసాక్షి వ్యాసాలవల్ల లభించిదైతే, తరువాతి బిరుదులు నాటక కర్తగా ఆయన ప్రతిష్టను తెలిపేవి. రాధాకృష్ణ, పాదుకా పట్టాభిషేకము, కాంఠాభరణం వంటి అనేక నాటకాలు రచించి నాటక కర్తగా విశేష ఖ్యాతి సంపాదించుకున్న పానుగంటి పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులు.
సాక్షి వ్యాసాలు 1913 లో సువర్ణలేఖ పత్రికలో ప్రారంభమై కొంత కాలం తర్వాత ఆగిపోయాయి. మళ్ళి 1920 లో ఆంధ్ర పత్రికలో ప్రారంభమై కొనసాగాయి. మొత్తం 147 వ్యాసాలు ఆరుసంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
సంఘ విమర్శకు హాస్య వ్యంగం ధోరణి ఎలా ఉపయోగపడుతుందో నిరూపించే రచన సాక్షి. స్వభావ, సంస్కృతులపై అభిమానాన్ని ప్రోత్సహిస్తూ, అవిమర్శంగా పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడాన్నీ ఖండిస్తూ అనర్గళ ధారా ప్రవాహంగా నడిచే సాక్షి వ్యాసాలను ఈతరం బాలబాలికలు, యువతీ యువకులు తప్పకుండా చదవాలి.
- పానుగంటి లక్ష్మినరసింహారావు
పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకోనిన న్యాయవాదులను జేర్చుకోనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యేములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచ్చున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. పెరుగుచున్న నేరములు పెరుగుచునే యున్నవి. కట్టించుచున్న కారాగృహములను గట్టించుచునే యున్నారు. ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య యెదుగుచునే యున్నది. నరహత్య చేసినవారిని జంపుటకు నానావిధ యంత్రములు కల్పించుచునే యున్నారు. హత్యలు వృద్ధియగుచునేయున్నవి. సర్వకాల సర్వావస్థల్లోనూ సంఘంలో దోషాలుంటాయి. ఉత్తములు ఆ దోషాలను చూసి బాధపడుతూ వుంటారు. వాటిని విమర్శిస్తుంటారు. దిద్దే ప్రయత్నం చేస్తుంటారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని సామెత. పరుష వాక్యంతో మనుషులు మారతారని ఆశ. రచయితలు సంఘ విమర్శ ద్వారా సంస్కరణ కోసం ప్రయత్నిస్తారు. అటువంటి ప్రయత్నాలలో 'సాక్షి' వ్యాసాల రచన ఒకటి. పానుగంటి లక్ష్మినరసింహారావుగారు(1865 - 1940) ఆంధ్రా ఎడిసన్, ఆంధ్రా షేక్స్పియర్, అభినవ కాళిదాసు బిరుదాంకితులు. మొదటి బిరుదుంసాక్షి వ్యాసాలవల్ల లభించిదైతే, తరువాతి బిరుదులు నాటక కర్తగా ఆయన ప్రతిష్టను తెలిపేవి. రాధాకృష్ణ, పాదుకా పట్టాభిషేకము, కాంఠాభరణం వంటి అనేక నాటకాలు రచించి నాటక కర్తగా విశేష ఖ్యాతి సంపాదించుకున్న పానుగంటి పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులు. సాక్షి వ్యాసాలు 1913 లో సువర్ణలేఖ పత్రికలో ప్రారంభమై కొంత కాలం తర్వాత ఆగిపోయాయి. మళ్ళి 1920 లో ఆంధ్ర పత్రికలో ప్రారంభమై కొనసాగాయి. మొత్తం 147 వ్యాసాలు ఆరుసంపుటాలుగా ప్రచురితమయ్యాయి. సంఘ విమర్శకు హాస్య వ్యంగం ధోరణి ఎలా ఉపయోగపడుతుందో నిరూపించే రచన సాక్షి. స్వభావ, సంస్కృతులపై అభిమానాన్ని ప్రోత్సహిస్తూ, అవిమర్శంగా పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడాన్నీ ఖండిస్తూ అనర్గళ ధారా ప్రవాహంగా నడిచే సాక్షి వ్యాసాలను ఈతరం బాలబాలికలు, యువతీ యువకులు తప్పకుండా చదవాలి. - పానుగంటి లక్ష్మినరసింహారావు
© 2017,www.logili.com All Rights Reserved.