పంతొమ్మిదవ సంవత్సరంలో నన్నుపట్టిన పానుగంటి లక్ష్మి నరసింహరావు గారు 25 వ ఏడు వచ్చేవరకు వదలలేదు. నామీద సాక్షి వ్యాసాలు చూపిన ప్రభావం ఎలాంటిదంటే "మూకం కరోతి వాచాలం" అన్నా అతిశయోక్తి లేదు. మద్రాసు ఎపుడు వెళ్ళినా ఎట్లాగైనా వీలుచూసుకొని ట్రిప్లికేన్ పార్థసారథి స్వామిని పలుకరించి వస్తాను. దానికి కారణం సాక్షిలోని పార్థసారథిస్వామి వ్యాసం. బ్రాహ్మణుడంటే ఎవరో కాలాచార్యులు, భక్తి ఎలా ఉండాలో ఒక వైష్ణవుడు ఉపన్యాసాల ద్వారా తెలిపారు.
రామానుజులవారి కరుణార్ద్రస్వభావం, వారు చెప్పిన, ఆచరించి చూపిన సర్వజనసమత, ఆండాళ, తిరుప్పావైలాంటి గంభీరమైన కారణాలేకాక కనులకింపైన అలంకరణలు, రుచికరమైన ప్రసాదాలు కూడా విశిష్టద్వైతం పట్ల అనురక్తి కలిగేటట్లు చేశాయి. అందుకు సాక్షి వ్యాసాలు కూడా దోహదపడ్డాయి. సాక్షి వ్యాసాలలో కలగాపులంగా అక్కడక్కడా ఉన్న వైష్ణవ సంబంధ వ్యాసాలన్నింటినీ సంపుటి చేయాలనే ప్రయత్నమే ఈ 'వైష్ణవసాక్షి' గా రూపుకట్టింది.
- రవికృష్ణ
పంతొమ్మిదవ సంవత్సరంలో నన్నుపట్టిన పానుగంటి లక్ష్మి నరసింహరావు గారు 25 వ ఏడు వచ్చేవరకు వదలలేదు. నామీద సాక్షి వ్యాసాలు చూపిన ప్రభావం ఎలాంటిదంటే "మూకం కరోతి వాచాలం" అన్నా అతిశయోక్తి లేదు. మద్రాసు ఎపుడు వెళ్ళినా ఎట్లాగైనా వీలుచూసుకొని ట్రిప్లికేన్ పార్థసారథి స్వామిని పలుకరించి వస్తాను. దానికి కారణం సాక్షిలోని పార్థసారథిస్వామి వ్యాసం. బ్రాహ్మణుడంటే ఎవరో కాలాచార్యులు, భక్తి ఎలా ఉండాలో ఒక వైష్ణవుడు ఉపన్యాసాల ద్వారా తెలిపారు. రామానుజులవారి కరుణార్ద్రస్వభావం, వారు చెప్పిన, ఆచరించి చూపిన సర్వజనసమత, ఆండాళ, తిరుప్పావైలాంటి గంభీరమైన కారణాలేకాక కనులకింపైన అలంకరణలు, రుచికరమైన ప్రసాదాలు కూడా విశిష్టద్వైతం పట్ల అనురక్తి కలిగేటట్లు చేశాయి. అందుకు సాక్షి వ్యాసాలు కూడా దోహదపడ్డాయి. సాక్షి వ్యాసాలలో కలగాపులంగా అక్కడక్కడా ఉన్న వైష్ణవ సంబంధ వ్యాసాలన్నింటినీ సంపుటి చేయాలనే ప్రయత్నమే ఈ 'వైష్ణవసాక్షి' గా రూపుకట్టింది. - రవికృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.