పురాణ ప్రలాపం
పురాణ ప్రలాపం ఆధునిక మైథిలీ సాహిత్యంలో ‘హస్యవతారం’గా, ‘వ్యంగ్య సామ్రాట్’ గా ప్రసిద్ధి కెక్కిన హరిమోహన్ ఝా విలక్షణ రచన. అయన అమర సృష్టి ‘వికటకవిచిన్నాన్న’ కావ్య శాస్త్ర వినోదానికి అపూర్వ భంగిమలు ప్రసాదిస్తాడు. అయన హస్యలహరిలో పది రామాయణం, మహాభారతం, భగవద్గీత , వేదాలు , పురాణాలూ అన్నీ తల్లక్రిందులై పోతాయి. దిగ్గజలాంటి వ్యక్తులు మరుగుజ్జులుగాను. సిద్ధాంత వాదులు వెర్రి వెంగాలప్పలుగాను, జీవన్ముక్తులు మట్టి ముద్దలు గాను రుజవవుతారు. అన్ని వేదశాస్త్ర పురాణాలూ అయన జిహ్వాగ్రంలో ఉంటాయి. అయన శాస్త్రాలను బంతుల్లాగా ఎగరవేసి ఆడుకుంటాడు. అల్ అడుకుంటునే జ్యోతిష్యాన్ని టక్కరి విద్య అనీ, ముహూర్త విద్యను ధూర్త విద్య అనీ, మంత్ర-తంత్రాలను కుట్ర అని, ధర్మ శాస్త్రాన్ని స్వార్ధ శాస్త్రమని రుజువు చేస్తాడు. అదే విధంగా ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, మోక్షం. వీటన్నిటిని ఏకి పోగులు పోగులు పెడతాడు. ఈ వికటకవిని కొందరు చార్వాకుడు, నాస్తికుడు అంటే కొందరు తార్కికుడంటారు. మరికొందరు విదూషకుడంటారు. ఎవరైతేనేం? విశుద్ధ వినోద భావంతో మనోవినోద ప్రసాదం పంచిపెడతారు. అందువల్ల అందరికి ప్రేమ పాత్రుడు. అంతేకాక అయన గుప్తజ్ఞాన సంపదను సాక్షాత్కరింపచేసే ప్రజ్ఞా నేత్రం కూడా!
పురాణ ప్రలాపం పురాణ ప్రలాపం ఆధునిక మైథిలీ సాహిత్యంలో ‘హస్యవతారం’గా, ‘వ్యంగ్య సామ్రాట్’ గా ప్రసిద్ధి కెక్కిన హరిమోహన్ ఝా విలక్షణ రచన. అయన అమర సృష్టి ‘వికటకవిచిన్నాన్న’ కావ్య శాస్త్ర వినోదానికి అపూర్వ భంగిమలు ప్రసాదిస్తాడు. అయన హస్యలహరిలో పది రామాయణం, మహాభారతం, భగవద్గీత , వేదాలు , పురాణాలూ అన్నీ తల్లక్రిందులై పోతాయి. దిగ్గజలాంటి వ్యక్తులు మరుగుజ్జులుగాను. సిద్ధాంత వాదులు వెర్రి వెంగాలప్పలుగాను, జీవన్ముక్తులు మట్టి ముద్దలు గాను రుజవవుతారు. అన్ని వేదశాస్త్ర పురాణాలూ అయన జిహ్వాగ్రంలో ఉంటాయి. అయన శాస్త్రాలను బంతుల్లాగా ఎగరవేసి ఆడుకుంటాడు. అల్ అడుకుంటునే జ్యోతిష్యాన్ని టక్కరి విద్య అనీ, ముహూర్త విద్యను ధూర్త విద్య అనీ, మంత్ర-తంత్రాలను కుట్ర అని, ధర్మ శాస్త్రాన్ని స్వార్ధ శాస్త్రమని రుజువు చేస్తాడు. అదే విధంగా ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, మోక్షం. వీటన్నిటిని ఏకి పోగులు పోగులు పెడతాడు. ఈ వికటకవిని కొందరు చార్వాకుడు, నాస్తికుడు అంటే కొందరు తార్కికుడంటారు. మరికొందరు విదూషకుడంటారు. ఎవరైతేనేం? విశుద్ధ వినోద భావంతో మనోవినోద ప్రసాదం పంచిపెడతారు. అందువల్ల అందరికి ప్రేమ పాత్రుడు. అంతేకాక అయన గుప్తజ్ఞాన సంపదను సాక్షాత్కరింపచేసే ప్రజ్ఞా నేత్రం కూడా!© 2017,www.logili.com All Rights Reserved.