" ఎక్కడ కర్షకుల శ్రమఫలం కర్షకులకే లభిస్తుందో
ఎక్కడ కార్మికుల శ్రమఫలం కార్మికులకే లభిస్తుందో
ఎక్కడ అన్నపురాసుల పక్కన ఆకలి చావులుండవో
ఎక్కడ దారిద్ర్యభూత వికటాట్టహాసాలు వినపడవో
ఎక్కడ పసిపాపల చిన్నారి చేతులు పనులను తాకవో
ఎక్కడ పడుచుదనం పిడికెడు మెతుకుల కోసం వ్యభిచరించదో
ఎక్కడ అసూయా, ద్వేషాలుండవో
ఎక్కడ యుద్ద ప్రేలాపనలు వినపడవో
ఎక్కడ విధ్యావిజ్ఞాన వాహినులు, సమస్త ప్రజల ముంగిట నిలిచి ఉంటాయో
ఎక్కడ ఆకలి, అజ్ఞానం, దారిద్ర్యం, నిరుద్యోగం, వ్యాధి-వ్యాపారం ఉండవో
ఎక్కడ దేశదేశాల ప్రజలు సుఖశాంతులతో స్వేచ్చా స్వాతంత్ర్యాలతో జీవిస్తారో
ఓ ప్రభూ!
ఆ సమాజం కావాలి
అలాంటి సమాజ నిర్మాణానికై
నా సోదరీ సోదరులను సమయత్తంచేసే
మహాయత్నంలో,నన్నూ నిమగ్నుడను కాని....."
- రావూరి భరద్వాజ.
(అంతరంగిణి)
" ఎక్కడ కర్షకుల శ్రమఫలం కర్షకులకే లభిస్తుందో ఎక్కడ కార్మికుల శ్రమఫలం కార్మికులకే లభిస్తుందో ఎక్కడ అన్నపురాసుల పక్కన ఆకలి చావులుండవో ఎక్కడ దారిద్ర్యభూత వికటాట్టహాసాలు వినపడవో ఎక్కడ పసిపాపల చిన్నారి చేతులు పనులను తాకవో ఎక్కడ పడుచుదనం పిడికెడు మెతుకుల కోసం వ్యభిచరించదో ఎక్కడ అసూయా, ద్వేషాలుండవో ఎక్కడ యుద్ద ప్రేలాపనలు వినపడవో ఎక్కడ విధ్యావిజ్ఞాన వాహినులు, సమస్త ప్రజల ముంగిట నిలిచి ఉంటాయో ఎక్కడ ఆకలి, అజ్ఞానం, దారిద్ర్యం, నిరుద్యోగం, వ్యాధి-వ్యాపారం ఉండవో ఎక్కడ దేశదేశాల ప్రజలు సుఖశాంతులతో స్వేచ్చా స్వాతంత్ర్యాలతో జీవిస్తారో ఓ ప్రభూ! ఆ సమాజం కావాలి అలాంటి సమాజ నిర్మాణానికై నా సోదరీ సోదరులను సమయత్తంచేసే మహాయత్నంలో,నన్నూ నిమగ్నుడను కాని....." - రావూరి భరద్వాజ. (అంతరంగిణి)
© 2017,www.logili.com All Rights Reserved.