అమ్మ అన్నది ఒక కమ్మని మాట, జగతికి ఆడదే ఆధారం, మమతల కోవెల, కలసి బతకడంలో వన్నెచిన్నెలు వంటి రచనలు నిజంగా యువతకు, అందునా వర్తమాన తరం వారికి 'జ్ఞానదీపికలు'. గ్రహించి తమనూ, తమ వారినీ, కుటుంబవ్యవస్థనూ సుఖసంతోషాలతో నిలుపుకోవడానికి ఉపకరించేవి. 'విశ్వం ఏకం' పెద్దబ్బాయి శ్రీహర్ష స్మృతిలో ఒక 'ఎలిజీ' యే అయిన ఒక ప్రణవ సత్యాన్ని ప్రపంచించే ఆర్ద్ర భావన! ఒక సమ్యక్ దృష్టి, సమన్వయ భావన కలిగిన అరుణావ్యాస అందుకే 'పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగుల్ చిమ్మగా' అని గురజాడా వారన్నదానికి వారసురాలిగా కానవచ్చే రచయిత్రి.
మూఢ ఛాందస నిరసనం. అదే సమయంలో వెర్రిపోకడల కొత్తదనం పట్ల ఆక్షేపణం, రెండూ చేస్తూనే, మంచి చెడుల విశ్లేషణతో ప్రగతి చింతనామృతాన్ని పంచిపెడుతుంది. నిజంగానే ఇది 'నవచేతన' కలిగించే అక్షరాలూ. 'అరుణ' కిరణాలు మట్టిని అయినా మణిదీపంగా ప్రకాశింప చేసే 'సాహితీ దీపికలు'.
అమ్మ అన్నది ఒక కమ్మని మాట, జగతికి ఆడదే ఆధారం, మమతల కోవెల, కలసి బతకడంలో వన్నెచిన్నెలు వంటి రచనలు నిజంగా యువతకు, అందునా వర్తమాన తరం వారికి 'జ్ఞానదీపికలు'. గ్రహించి తమనూ, తమ వారినీ, కుటుంబవ్యవస్థనూ సుఖసంతోషాలతో నిలుపుకోవడానికి ఉపకరించేవి. 'విశ్వం ఏకం' పెద్దబ్బాయి శ్రీహర్ష స్మృతిలో ఒక 'ఎలిజీ' యే అయిన ఒక ప్రణవ సత్యాన్ని ప్రపంచించే ఆర్ద్ర భావన! ఒక సమ్యక్ దృష్టి, సమన్వయ భావన కలిగిన అరుణావ్యాస అందుకే 'పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగుల్ చిమ్మగా' అని గురజాడా వారన్నదానికి వారసురాలిగా కానవచ్చే రచయిత్రి. మూఢ ఛాందస నిరసనం. అదే సమయంలో వెర్రిపోకడల కొత్తదనం పట్ల ఆక్షేపణం, రెండూ చేస్తూనే, మంచి చెడుల విశ్లేషణతో ప్రగతి చింతనామృతాన్ని పంచిపెడుతుంది. నిజంగానే ఇది 'నవచేతన' కలిగించే అక్షరాలూ. 'అరుణ' కిరణాలు మట్టిని అయినా మణిదీపంగా ప్రకాశింప చేసే 'సాహితీ దీపికలు'.© 2017,www.logili.com All Rights Reserved.