ఈ సంపుటం గత రెండు దశాబ్దాల తెలుగు కథల వస్తు, భావ, శిల్ప, శైలీ వైవిధ్యాలకు దర్పణం పడుతుంది. నాలుగు తరాల రచయితల కథలు ఈ సంపుటంలో ఉన్నాయి. విస్తృతంగా వ్రాసిన కథకులూ, బహుకొద్ది కథలు వ్రాసినవారూ ఈ సంపుటిలో చోటు చేసుకున్నారు. వామపక్ష రాజకీయపు కథల నుండి తాత్వికాణ్వేషణ వరకూ భిన్నవస్తువలపై కథలున్నాయి. ఈ రెండు దశాబ్దాలలో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనేక ఉద్యమాల, రాజకీయ సాంఘిక పరిస్థితుల ప్రభావం చాలా కథల్లో గోచరిస్తుంది. అదృశ్యమైపోతున్న జీవన విధానాల దగ్గరనుండి ఇంతకు ముందెన్నడూ కనని, వినని నూతన విషయాల వరకూ ఈ కథల్లో ఉన్నాయి. ఆంధ్రపదేశ్ నలుచెరుగుల నుండి రకరకాల వ్యక్తులు తమ తమ మాండలికాలలో ఈ కథలు వినిపిస్తారు. పురాణ కథల పునర్మథనం దగ్గర నుంచి మ్యాజికల్ రియలిజం వరకూ రకరకాల ప్రక్రియలు కనిపిస్తాయి. నవరసాల అనుభూతులు, ముఖ్యంగా రావిశాస్త్రి కథల్లో శ్రీశ్రీ ఉందని చెప్పిన రసన, ఈ కథలు అందిస్తాయి.
డా. జంపాల చౌదరి
ఈ సంపుటం గత రెండు దశాబ్దాల తెలుగు కథల వస్తు, భావ, శిల్ప, శైలీ వైవిధ్యాలకు దర్పణం పడుతుంది. నాలుగు తరాల రచయితల కథలు ఈ సంపుటంలో ఉన్నాయి. విస్తృతంగా వ్రాసిన కథకులూ, బహుకొద్ది కథలు వ్రాసినవారూ ఈ సంపుటిలో చోటు చేసుకున్నారు. వామపక్ష రాజకీయపు కథల నుండి తాత్వికాణ్వేషణ వరకూ భిన్నవస్తువలపై కథలున్నాయి. ఈ రెండు దశాబ్దాలలో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనేక ఉద్యమాల, రాజకీయ సాంఘిక పరిస్థితుల ప్రభావం చాలా కథల్లో గోచరిస్తుంది. అదృశ్యమైపోతున్న జీవన విధానాల దగ్గరనుండి ఇంతకు ముందెన్నడూ కనని, వినని నూతన విషయాల వరకూ ఈ కథల్లో ఉన్నాయి. ఆంధ్రపదేశ్ నలుచెరుగుల నుండి రకరకాల వ్యక్తులు తమ తమ మాండలికాలలో ఈ కథలు వినిపిస్తారు. పురాణ కథల పునర్మథనం దగ్గర నుంచి మ్యాజికల్ రియలిజం వరకూ రకరకాల ప్రక్రియలు కనిపిస్తాయి. నవరసాల అనుభూతులు, ముఖ్యంగా రావిశాస్త్రి కథల్లో శ్రీశ్రీ ఉందని చెప్పిన రసన, ఈ కథలు అందిస్తాయి. డా. జంపాల చౌదరి© 2017,www.logili.com All Rights Reserved.