జర్నలిస్టు, సృజనాత్మక రచయిత అవడం వల్ల సామజిక పరిస్థితుల పట్ల, వివిధ రంగాల్లోని వ్యక్తుల మనస్తతత్వాలు, ప్రవర్తన పట్ల ఆసక్తి, అవగాహనా పుష్కలంగాను లోతుగానూ వున్నట్లు గ్రహిస్తాం. ఈయన కథలు చదువుతున్నప్పుడు.
ఈ సంపుటంలోని పన్నెండు కథల్లోనూ ఐదు కథలు ప్రధానంగా స్త్రీల అణచివేత గురించి, వారిపై జరిగే రకరకాల దాడుల గురించి, అభ్యుదయ దృక్పథంతో రాసిన కథలు. పాకిస్తాన్ లో తాలిబన్లు ఆడపిల్లల్ని బడికి పోనివ్వకూడదని వారిపై చేసిన దురాగతాలను ఎదుర్కొంటూ, చదువుకోవాలనే పట్టుదలతో మలాలా చేసిన పోరాటాన్ని, బతికి బయటపడి సాధించిన విజయాన్ని చిత్రించిన "మలాలా అల్లా" కథ. ప్రపంచంలోని పేద ఆడపిల్లలందరూ మలాలాని ఆదర్శంగా తీసుకోవాలని, చందమామని, నక్షతరాల్ని, పువ్వుల్ని, పక్షుల్ని పాత్రలుగా చేసి రాసిన ఒక కథ.
ప్రస్తుత సంపుటంలోని 12 కథలు మన మధ్య కనిపించే మానవ జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రూపు దిద్దుకున్నవే. ఈ కథలన్నింటిలోనూ ప్రధానంగా కనిపించే అంశం ఏమిటంటే, అంతర్లినంగా ఓ చక్కని సందేశం ఇమిడి ఉంటుంది. ఈ కథానికలను చదువుతున్నప్పుడు, మనకు స్పష్టంగా కనిపించే మరొక అంశం, రచయిత అద్భుత శైలి సరళంగా సూటిగా ఉంటుంది. ప్రతి కథలోనూ తెలుగుతనం, తెలుగు మాధుర్యం, ఉట్టి పడుతుంటాయి. విటిల్లోని తెలుగు భాషలోని సహజ సౌందర్యాన్ని ఎవరైనా ఆస్వాదించవచ్చు.
-పప్పు వేణుగోపాలరావు.
జర్నలిస్టు, సృజనాత్మక రచయిత అవడం వల్ల సామజిక పరిస్థితుల పట్ల, వివిధ రంగాల్లోని వ్యక్తుల మనస్తతత్వాలు, ప్రవర్తన పట్ల ఆసక్తి, అవగాహనా పుష్కలంగాను లోతుగానూ వున్నట్లు గ్రహిస్తాం. ఈయన కథలు చదువుతున్నప్పుడు. ఈ సంపుటంలోని పన్నెండు కథల్లోనూ ఐదు కథలు ప్రధానంగా స్త్రీల అణచివేత గురించి, వారిపై జరిగే రకరకాల దాడుల గురించి, అభ్యుదయ దృక్పథంతో రాసిన కథలు. పాకిస్తాన్ లో తాలిబన్లు ఆడపిల్లల్ని బడికి పోనివ్వకూడదని వారిపై చేసిన దురాగతాలను ఎదుర్కొంటూ, చదువుకోవాలనే పట్టుదలతో మలాలా చేసిన పోరాటాన్ని, బతికి బయటపడి సాధించిన విజయాన్ని చిత్రించిన "మలాలా అల్లా" కథ. ప్రపంచంలోని పేద ఆడపిల్లలందరూ మలాలాని ఆదర్శంగా తీసుకోవాలని, చందమామని, నక్షతరాల్ని, పువ్వుల్ని, పక్షుల్ని పాత్రలుగా చేసి రాసిన ఒక కథ. ప్రస్తుత సంపుటంలోని 12 కథలు మన మధ్య కనిపించే మానవ జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రూపు దిద్దుకున్నవే. ఈ కథలన్నింటిలోనూ ప్రధానంగా కనిపించే అంశం ఏమిటంటే, అంతర్లినంగా ఓ చక్కని సందేశం ఇమిడి ఉంటుంది. ఈ కథానికలను చదువుతున్నప్పుడు, మనకు స్పష్టంగా కనిపించే మరొక అంశం, రచయిత అద్భుత శైలి సరళంగా సూటిగా ఉంటుంది. ప్రతి కథలోనూ తెలుగుతనం, తెలుగు మాధుర్యం, ఉట్టి పడుతుంటాయి. విటిల్లోని తెలుగు భాషలోని సహజ సౌందర్యాన్ని ఎవరైనా ఆస్వాదించవచ్చు. -పప్పు వేణుగోపాలరావు.© 2017,www.logili.com All Rights Reserved.