సం'జీవ సాగరం' లోనికి దూకేలా ప్రేరేపించడానికి రావెల తాగించిన తియ్యటి దోసిళ్ళ నీళ్ళు ఇవి. స్వస్థలం తుమ్మపూడి కేంద్రంగా ప్రపంచాన్ని మానసికంగా చుట్టివచ్చిన సంజీవదేవ్ బాల్యం, సంగీతం, చిత్రకళ పట్ల ఆయనకు మమకారం. చిన్నప్పటి ఆటలు, హిమాలయాల ప్రయాణం, మతం, మరణం గురించిన భావనలు, మిత్రులకు రాసిన లేఖలు, 'గీతాంజలి' లాంటి పుస్తకాలకు రాసిన పీటికలు, టాగోర్ ముని మేనల్లుడు, చిత్రకారుడు అసిత్ కుమార్ హల్దార్, మరో విఖ్యాత చిత్రకారుడు నికోలస్ రోరిక్, మహా పండితుడు రాహుల్ సాంసృతియాన్ వంటి వారితో గల సహచర్యం; ఇవన్ని రసరేఖామాత్రంగా సృజించారు రచయిత. 1914 లో జన్మించిన దేవ్ జీవితంలో రెండో ప్రపంచ యుద్ధం జరగడం, స్వాతంత్ర్యం రావడం, గాంధీజీ హత్యకు గురికావడం తారసపడతాయి. సంజీవ్ రాసుకున్నదానికే తనదైన కొంత ఉప్పు కలిపి తిప్పి వడ్డించడం లాంటిదిది. అందుకే రచయిత దీనిని వినయంగానే అనుసృజనగానే చెప్పుకున్నారు. అనుబంధంగా ఫోటోలు, సంజీవదేవ్ వేసిన పెయింటింగ్స్ జత చేసారు. ముద్రణ కూడా అందంగానే ఉంది.
-షేర్ షా
© 2017,www.logili.com All Rights Reserved.