సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం సైన్సుతో ముడిపడి ఉంది. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా, ఎన్నెన్ని కొత్త పరికరాలు రూపొందించినా ఆ కృషి పరమార్ధం మానవ జాతి ప్రగతి కోసం. అందుకే అవన్నీ జాతికి అంకితం. ఫలితం సైన్స్ ప్రతి ఒక్కరి సొత్తు.
ఈ సృష్టిలో అన్నిటికన్నా అపురూపమైనది మానవ మేధ. ప్రగతిపధంలో వేసే ప్రతి ముందడుగుకు మూలం మానవ వనరులు. విద్యార్ధి దశనుండి ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను మానవ సుఖశాంతులవైపు కేంద్రీకృతం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే జరుగుతున్న సైన్స్ పరిశోధనలు వాటి అంతిమ లక్ష్యాలపై అవగాహన ఎంతో అవసరం.
ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న సైన్స్ పరిశోధనలు - వాటి ఫలితాలు - సమాజ శ్రేయస్సు కోసం అవి ఎలా వినియోగాపడుతున్నది ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో తేలిక తెలుగు భాషలో ఈ పుస్తకం రూపకల్పన చేయబడింది.
ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఈ పుస్తకం వారి భోధనలో నూతన సరళి చోటు చేసుకునేందుకు సహకరిస్తుంది. కొత్త కొత్త సైన్స్ విషయాలు బోధనలో జోడిస్తే విద్యార్దుల ఆసక్తి పెరగడమేగాక ఆయా అంశాలపై ప్రాధమిక అవగాహన ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఒక చక్కని నేస్తంగా ఉపయోగపడుతుంది.
సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం సైన్సుతో ముడిపడి ఉంది. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా, ఎన్నెన్ని కొత్త పరికరాలు రూపొందించినా ఆ కృషి పరమార్ధం మానవ జాతి ప్రగతి కోసం. అందుకే అవన్నీ జాతికి అంకితం. ఫలితం సైన్స్ ప్రతి ఒక్కరి సొత్తు. ఈ సృష్టిలో అన్నిటికన్నా అపురూపమైనది మానవ మేధ. ప్రగతిపధంలో వేసే ప్రతి ముందడుగుకు మూలం మానవ వనరులు. విద్యార్ధి దశనుండి ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను మానవ సుఖశాంతులవైపు కేంద్రీకృతం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే జరుగుతున్న సైన్స్ పరిశోధనలు వాటి అంతిమ లక్ష్యాలపై అవగాహన ఎంతో అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న సైన్స్ పరిశోధనలు - వాటి ఫలితాలు - సమాజ శ్రేయస్సు కోసం అవి ఎలా వినియోగాపడుతున్నది ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో తేలిక తెలుగు భాషలో ఈ పుస్తకం రూపకల్పన చేయబడింది. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఈ పుస్తకం వారి భోధనలో నూతన సరళి చోటు చేసుకునేందుకు సహకరిస్తుంది. కొత్త కొత్త సైన్స్ విషయాలు బోధనలో జోడిస్తే విద్యార్దుల ఆసక్తి పెరగడమేగాక ఆయా అంశాలపై ప్రాధమిక అవగాహన ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఒక చక్కని నేస్తంగా ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.