గ్రహనాంతర సీమల్లో విహరిస్తూ గ్రహాలను తన సున్నితమైన చేతులతో బంతులాడిన వాడు-
వ్యోమ వీధుల్లో విధిని వెన్నాడుతూ నక్షత్ర ధూళిని తన గులాబి పాదాలతో చెలరేపిన వాడు-
కాలాన్ని కాంతి వేగంతో పరుగులెత్తిస్తూ కాలావదులు దాటి కవితలు రాసిన వాడు-
'ఆంధ్రీ మార్వా' ఫ్రెంచి రచయిత. ఆయనకు ఆంగ్ల కవులంటే ఎనలేని గౌరవం. ముఖ్యంగా షెల్లీ, భైరన్. ఎన్నో దశాబ్దాలు శ్రమించి, ప్రయాణాలు చేసి అప్పటికి వంద సంవత్సరాల క్రితం జీవించిన కవి గురించి, పరిశోదన చేసి, దొరికిన పుస్తకాలు, ఉత్తరాలు, ఆయా వ్యక్తులు రాసుకున్న జర్నల్స్ పోగుచేసి, అధ్యయనం చేసి - షెల్లీ జీవించిన ప్రదేశాల్లో, పయనించిన దారుల్లో ఇంకా ఏమైనా పాదముద్రలు మిగిలాయా అని ఎంతగానో తపన చెంది, షెల్లీని అవగాహన చేసుకుని ఈ రచన వెలువరించాడు, అదీ ఫ్రెంచి భాషలో.
నేను నేర్చిన ఆంగ్ల పదాల పరిమితులు ఏ పాటి? కానీ 'ఆంధ్రీ మార్వా' ఫ్రెంచి అనువాదాన్ని ఎన్నో మార్లు చదివాను. ఎందుకు? అతని ఫ్రెంచి ఆలోచనలను కొంతవరకైనా అవగాహనా చేసుకోవాలని. చివరకి షెల్లీని ఆశ్రయించి ఈ తెలుగు రూపాన్ని ఇవ్వగలిగానంటే - ఈ గ్రంథంలోని జీవితాలు, ప్రేమలు, విషాదాలు, మరణాలు, సమాధులు,తుఫానులు, ఆయా వ్యక్తుల సాహసాలు, రెండు శతాబ్దాల కాలం నాటి పరిస్థితులు - ఇవన్నీ, ఇంకా ఎన్నో, నన్ను పూర్తిగా ఆక్రమించి ఆవహించాయి. అదిగో ఆ స్థితి నుంచి ఆవిర్భవించిందే ఈ సృజన. శ్రద్దగా చదవాలి, ఆ కాలానికి, ఆ వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడాలి, పలకరించాలి, వారి సాహసాలను అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ విషాదం పండుతుంది. గుండె మండుతుంది. కనులు చెమ్మగిల్లుతాయి.
ఈ రచనల్లో ఎన్నో క్రియా రహిత వాక్యాలుండవచ్చు. ఇది వ్యాకరణానికి లొంగక పోనూవచ్చు. తప్పుపట్టకండి. మరో విషయం, ఈ విషాదం ఎప్పుడో జరిగినట్లు కాకుండా, ఇంతకూ ముందే జరుగుతోందని చెప్పడం, ఆయా సంఘటనలకు మళ్ళి ప్రాణం పోయటానికే. మార్పులు, చేర్పులు, కూర్పులు చేసిన తరువాత - ఇంకా అచ్చు తప్పులుండవచ్చు. అవి షెల్లీ అందానికి దిష్టి తగలకుండా ఉంచామనుకోండి.
- అశ్వినీకుమార్
గ్రహనాంతర సీమల్లో విహరిస్తూ గ్రహాలను తన సున్నితమైన చేతులతో బంతులాడిన వాడు- వ్యోమ వీధుల్లో విధిని వెన్నాడుతూ నక్షత్ర ధూళిని తన గులాబి పాదాలతో చెలరేపిన వాడు- కాలాన్ని కాంతి వేగంతో పరుగులెత్తిస్తూ కాలావదులు దాటి కవితలు రాసిన వాడు- 'ఆంధ్రీ మార్వా' ఫ్రెంచి రచయిత. ఆయనకు ఆంగ్ల కవులంటే ఎనలేని గౌరవం. ముఖ్యంగా షెల్లీ, భైరన్. ఎన్నో దశాబ్దాలు శ్రమించి, ప్రయాణాలు చేసి అప్పటికి వంద సంవత్సరాల క్రితం జీవించిన కవి గురించి, పరిశోదన చేసి, దొరికిన పుస్తకాలు, ఉత్తరాలు, ఆయా వ్యక్తులు రాసుకున్న జర్నల్స్ పోగుచేసి, అధ్యయనం చేసి - షెల్లీ జీవించిన ప్రదేశాల్లో, పయనించిన దారుల్లో ఇంకా ఏమైనా పాదముద్రలు మిగిలాయా అని ఎంతగానో తపన చెంది, షెల్లీని అవగాహన చేసుకుని ఈ రచన వెలువరించాడు, అదీ ఫ్రెంచి భాషలో. నేను నేర్చిన ఆంగ్ల పదాల పరిమితులు ఏ పాటి? కానీ 'ఆంధ్రీ మార్వా' ఫ్రెంచి అనువాదాన్ని ఎన్నో మార్లు చదివాను. ఎందుకు? అతని ఫ్రెంచి ఆలోచనలను కొంతవరకైనా అవగాహనా చేసుకోవాలని. చివరకి షెల్లీని ఆశ్రయించి ఈ తెలుగు రూపాన్ని ఇవ్వగలిగానంటే - ఈ గ్రంథంలోని జీవితాలు, ప్రేమలు, విషాదాలు, మరణాలు, సమాధులు,తుఫానులు, ఆయా వ్యక్తుల సాహసాలు, రెండు శతాబ్దాల కాలం నాటి పరిస్థితులు - ఇవన్నీ, ఇంకా ఎన్నో, నన్ను పూర్తిగా ఆక్రమించి ఆవహించాయి. అదిగో ఆ స్థితి నుంచి ఆవిర్భవించిందే ఈ సృజన. శ్రద్దగా చదవాలి, ఆ కాలానికి, ఆ వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడాలి, పలకరించాలి, వారి సాహసాలను అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ విషాదం పండుతుంది. గుండె మండుతుంది. కనులు చెమ్మగిల్లుతాయి. ఈ రచనల్లో ఎన్నో క్రియా రహిత వాక్యాలుండవచ్చు. ఇది వ్యాకరణానికి లొంగక పోనూవచ్చు. తప్పుపట్టకండి. మరో విషయం, ఈ విషాదం ఎప్పుడో జరిగినట్లు కాకుండా, ఇంతకూ ముందే జరుగుతోందని చెప్పడం, ఆయా సంఘటనలకు మళ్ళి ప్రాణం పోయటానికే. మార్పులు, చేర్పులు, కూర్పులు చేసిన తరువాత - ఇంకా అచ్చు తప్పులుండవచ్చు. అవి షెల్లీ అందానికి దిష్టి తగలకుండా ఉంచామనుకోండి. - అశ్వినీకుమార్© 2017,www.logili.com All Rights Reserved.