'వాలి హిరణ్మయీదేవి' ఈ పేరు వింటేనే ఓ ఫీల్ గుడ్ స్టోరీ కళ్ళముందు మెదులుతుంది. ముప్పై సంవత్సరాల క్రితం సాహితీవనంలో వికసించిన ఈ కుసుమం వెదజల్లిన సౌరభాలు ఎన్నెన్నో. హిరణ్మయిదేవిగారికి స్నేహితులంటే ప్రాణమనీ, స్నేహమంటే పవిత్రమైన బంధమని భావిస్తారనీ వారి రచనలు చదువుతుంటే అర్థమవుతుంది. ఈ సంపుటిలోనున్న ఇరవై ఒక్క కథల్లోనూ ఎనిమిది కథలు ఇద్దరు స్నేహితుల చుట్టూ నడుస్తాయి.
మొదటి కథలోనే, కన్నకొడుకు రాజు నుంచి ఒక మంచిమాట దొరకని గోపాలరావు సమస్యని, అతని స్నేహితుడు శంకరరావు రాజు దగ్గరికి వెళ్లి సామరస్యంగా పరిష్కరిస్తాడు. శేఖరం చనిపోయాడని చూడటానికి వెళ్ళిన స్నేహితుడు, అతనికి అందిన గౌరవాలని చూసి తన కోపాన్ని, క్రమశిక్షణనీ తగ్గించుకుంటాడు. ఐతే ఆర్నెల్లు తిరక్కుండానే శేఖరం కుటుంబం అతన్ని మర్చిపోవడం చూస్తాడు. పైగా కుటుంబ సభ్యులు తన నెమ్మదితనాన్ని చాతకానితనంగా తీసుకుంటున్నారని గమనించి ఎవరికీ అలుసియ్యకూడదని, తన సహజ స్వభావానికి మారిపోతాడు, 'అలుసిచ్చావా అంతే..' లో. ఈ సంపుటిలో చాలా కథలు బహుమతులు పొందినవే. హిరణ్మయిదేవి గారు మరిన్ని మంచి ఆలోచనాత్మక రచనలు సాగించి బహుమతులు పొందాలని ఆశిస్తున్నాను.
- మంథా భానుమతి
'వాలి హిరణ్మయీదేవి' ఈ పేరు వింటేనే ఓ ఫీల్ గుడ్ స్టోరీ కళ్ళముందు మెదులుతుంది. ముప్పై సంవత్సరాల క్రితం సాహితీవనంలో వికసించిన ఈ కుసుమం వెదజల్లిన సౌరభాలు ఎన్నెన్నో. హిరణ్మయిదేవిగారికి స్నేహితులంటే ప్రాణమనీ, స్నేహమంటే పవిత్రమైన బంధమని భావిస్తారనీ వారి రచనలు చదువుతుంటే అర్థమవుతుంది. ఈ సంపుటిలోనున్న ఇరవై ఒక్క కథల్లోనూ ఎనిమిది కథలు ఇద్దరు స్నేహితుల చుట్టూ నడుస్తాయి. మొదటి కథలోనే, కన్నకొడుకు రాజు నుంచి ఒక మంచిమాట దొరకని గోపాలరావు సమస్యని, అతని స్నేహితుడు శంకరరావు రాజు దగ్గరికి వెళ్లి సామరస్యంగా పరిష్కరిస్తాడు. శేఖరం చనిపోయాడని చూడటానికి వెళ్ళిన స్నేహితుడు, అతనికి అందిన గౌరవాలని చూసి తన కోపాన్ని, క్రమశిక్షణనీ తగ్గించుకుంటాడు. ఐతే ఆర్నెల్లు తిరక్కుండానే శేఖరం కుటుంబం అతన్ని మర్చిపోవడం చూస్తాడు. పైగా కుటుంబ సభ్యులు తన నెమ్మదితనాన్ని చాతకానితనంగా తీసుకుంటున్నారని గమనించి ఎవరికీ అలుసియ్యకూడదని, తన సహజ స్వభావానికి మారిపోతాడు, 'అలుసిచ్చావా అంతే..' లో. ఈ సంపుటిలో చాలా కథలు బహుమతులు పొందినవే. హిరణ్మయిదేవి గారు మరిన్ని మంచి ఆలోచనాత్మక రచనలు సాగించి బహుమతులు పొందాలని ఆశిస్తున్నాను. - మంథా భానుమతి© 2017,www.logili.com All Rights Reserved.