Title | Price | |
Endaro Mahanubhavulu | Rs.250 | In Stock |
"ఎందరో మహానుభావులు" అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు పేరిట గతంలో రాసిన వ్యాసాలకు వచ్చిన ఆదరణ చూసి నేను పులకించిపోయాను. 'హాసం' లో రాస్తున్న వ్యాసాలకి పత్రికాముఖంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేవి. నేను రాసిన వ్యాసాల్లోని సంగీతకారుల మనవళ్లమని, మునిమనవళ్లమని, వాళ్ళ తాలూకు మరిన్ని వివరాలను పంపగమని..., కొంతమంది పంపిన వాళ్ళున్నారు.
ప్రముఖ చిత్రకారులు, దర్శకులు బాపు గారు నా వ్యాసాలు చదివి మెచ్చుకుంటూ తమిళ సంగీతకారుల జీవితాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు పంపారు.
ఇలా పరోక్షంగా సంగీతంతో పరిచయమైన నాకు పరోక్షంగానే ఎందరో మహానుభావులు వల్ల యింత కీర్తి ప్రతిష్టలు రావడం నా సాహితీ జీవితంలో ముఖ్యమైన ఓ ఘట్టం.
సరస్వతిని అర్చించి, మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన 51 మంది సంగీతజ్ఞుల జీవితాలలోని నాటకీయ ఘట్టాలను రసవత్తరంగా, నాటకియంగా అక్షరాల కెక్కించిన భరణి అగుపిస్తారీ పుస్తకంలో.
11 నాటికలు, 55 సినిమాలు, వ్యాసాలు రచించి 'పరికిణీ' 'ఆట కదరా శివా' కవితాసంకలనాలు వెలయించి 750 పైచిలుకు సినిమాలలో తన అభినయం ద్వారా మురిపించిన శ్రీ భరణి 'హాసం' హాస్య - సంగీత పత్రికలో 3 ఏళ్ల పాటు నిర్వహించిన శిర్షిక ద్వారా సామాన్యపాఠకులలో సైతం శాస్త్రీయ కళాకారులపై ఆసక్తి, అనురక్తి భక్తీ కలిగించారు. ఆ వ్యాసపరంపరకు పుస్తకరూపం ఇది.
- తనికెళ్ళ భరణి
"ఎందరో మహానుభావులు" అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు పేరిట గతంలో రాసిన వ్యాసాలకు వచ్చిన ఆదరణ చూసి నేను పులకించిపోయాను. 'హాసం' లో రాస్తున్న వ్యాసాలకి పత్రికాముఖంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేవి. నేను రాసిన వ్యాసాల్లోని సంగీతకారుల మనవళ్లమని, మునిమనవళ్లమని, వాళ్ళ తాలూకు మరిన్ని వివరాలను పంపగమని..., కొంతమంది పంపిన వాళ్ళున్నారు. ప్రముఖ చిత్రకారులు, దర్శకులు బాపు గారు నా వ్యాసాలు చదివి మెచ్చుకుంటూ తమిళ సంగీతకారుల జీవితాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు పంపారు. ఇలా పరోక్షంగా సంగీతంతో పరిచయమైన నాకు పరోక్షంగానే ఎందరో మహానుభావులు వల్ల యింత కీర్తి ప్రతిష్టలు రావడం నా సాహితీ జీవితంలో ముఖ్యమైన ఓ ఘట్టం. సరస్వతిని అర్చించి, మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన 51 మంది సంగీతజ్ఞుల జీవితాలలోని నాటకీయ ఘట్టాలను రసవత్తరంగా, నాటకియంగా అక్షరాల కెక్కించిన భరణి అగుపిస్తారీ పుస్తకంలో. 11 నాటికలు, 55 సినిమాలు, వ్యాసాలు రచించి 'పరికిణీ' 'ఆట కదరా శివా' కవితాసంకలనాలు వెలయించి 750 పైచిలుకు సినిమాలలో తన అభినయం ద్వారా మురిపించిన శ్రీ భరణి 'హాసం' హాస్య - సంగీత పత్రికలో 3 ఏళ్ల పాటు నిర్వహించిన శిర్షిక ద్వారా సామాన్యపాఠకులలో సైతం శాస్త్రీయ కళాకారులపై ఆసక్తి, అనురక్తి భక్తీ కలిగించారు. ఆ వ్యాసపరంపరకు పుస్తకరూపం ఇది. - తనికెళ్ళ భరణి© 2017,www.logili.com All Rights Reserved.