డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం
నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రముఖపాత్ర పోషించారు. నన్ను ప్రభావితం చేసి, నాకు దిశానిర్దేశం చేసిన ఎందరో ఉపాధ్యాయులను జీవిత చరమాంకం వరకూ మరచి పోలేను. ముఖ్యంగా పాఠశాలలో ప్రాథమిక పాఠాలు నేర్పిన శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ నా ఆశయానికి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు జ్ఞానాన్నివ్వడమే కాక, వారిలో ఉదాత్తమైన ఆశయాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచి పోషిస్తాడనీ అర్థం చేసుకున్నాను.
ఆశయానికి బీజం వేసిన బడిపంతులు :
రామేశ్వరం పాఠశాలలో నేను అయిదో తరగతి చదువుతున్నపుడు మాకు శ్రీశివసుబ్రహ్మణ్య అయ్యర్ ఉపాధ్యాయుడుగా పాఠాలు చెప్పేవారు. తన దగ్గర చదువుకునే విద్యార్థులను అమితంగా ప్రేమించే ఉపాధ్యాయులలో ఆయన ఒకరు. ఆయన ఒక రోజు పక్షులు ఎలా ఎగురుతాయో పాఠం చెప్పాడు. నల్లబల్ల మీద ఒక పక్షి బొమ్మ గీసి దాని తల, తోక, రెక్కల్ని, అల్లార్చడం ద్వారా ఎలా ఎగురగలుగుతాయో, ఆ ప్రయత్నంలో తమ తోక ద్వారా ఎలా దిక్కులు మార్చుకోగలుగుతాయో చూపించారు. దాదాపు అరగంట పాటు విహంగం విహారం గురించి చక్కగా వివరించారు. పాఠం ముగించాక అర్థంమైందా? అని అందరినీ అడిగారు. నేను ఎలాంటి సంకోచం లేకుండా నాకు అర్థం కాలేదని చెప్పాను. ఆ మాటే చాలామంది విద్యార్థులు చెప్పారు. మా సమాధానానికి మా మాస్టరు ఏమీ నిరుత్సాహపడలేదు. సహనాన్ని కోల్పోలేదు.
ఆ సాయంకాలం మమ్మల్నందరినీ సముద్రతీరానికి తీసుకువెళ్ళారు. అప్పుడు అయ్యర్ గారు ఆకాశంలో గుంపులు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించారు. ఆ అద్భుతమైన పక్షి సమూహాలను చూసి మేం విభ్రాంతులమయ్యాం. వారు ఆ పక్షుల్ని చూపిస్తూ అవి అలా ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లాడిస్తున్నాయో గమనించమన్నారు. అవి తాము కోరుకున్న దిశకు తిరగడానికి తమ తోకల్ని ఎలా వాడుకుంటున్నాయో పరిశీలించమన్నారు.
అప్పుడాయన మమ్మల్ని, "పక్షిని నడిపిస్తున్న ఆ యంత్రం ఎక్కడుంది? దానికి ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?” అని అడిగారు, చివరకు జవాబు కూడా ఆయనే చెప్పారు. పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తేనని, దాని ఇచ్ఛాశక్తే దాని చోదకశక్తి అని వివరించారు. అంత గహనమైన భావనల్ని ఆయన మా కళ్ళెదుట కనపడుతున్న దృష్టాంతంతో సులభంగా సరళంగా బోధపరిచారు. నా వరకూ నేను ఆ రోజు తెలుసుకున్నది. కేవలం ఒక పక్షి ఎలా ఎగురుతున్నదన్న అంశంతో ఆగిపోలేదు. ఆరోజున ఆయన చెప్పిన పాఠం నాలో విశిష్ట అనుభూతిని జాగృతం చేసింది. నేను భవిష్యత్తులో చదువుకోబోయే చదువు ఆకాశయాన వ్యవస్థలకు సంబంధించి ఉండాలని తీర్మానించుకున్నాను. ఒక సాయంకాలం పాఠశాల ముగిసిన తరువాత నా మనస్సులోని మాటను...................
డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రముఖపాత్ర పోషించారు. నన్ను ప్రభావితం చేసి, నాకు దిశానిర్దేశం చేసిన ఎందరో ఉపాధ్యాయులను జీవిత చరమాంకం వరకూ మరచి పోలేను. ముఖ్యంగా పాఠశాలలో ప్రాథమిక పాఠాలు నేర్పిన శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ నా ఆశయానికి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు జ్ఞానాన్నివ్వడమే కాక, వారిలో ఉదాత్తమైన ఆశయాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచి పోషిస్తాడనీ అర్థం చేసుకున్నాను. ఆశయానికి బీజం వేసిన బడిపంతులు : రామేశ్వరం పాఠశాలలో నేను అయిదో తరగతి చదువుతున్నపుడు మాకు శ్రీశివసుబ్రహ్మణ్య అయ్యర్ ఉపాధ్యాయుడుగా పాఠాలు చెప్పేవారు. తన దగ్గర చదువుకునే విద్యార్థులను అమితంగా ప్రేమించే ఉపాధ్యాయులలో ఆయన ఒకరు. ఆయన ఒక రోజు పక్షులు ఎలా ఎగురుతాయో పాఠం చెప్పాడు. నల్లబల్ల మీద ఒక పక్షి బొమ్మ గీసి దాని తల, తోక, రెక్కల్ని, అల్లార్చడం ద్వారా ఎలా ఎగురగలుగుతాయో, ఆ ప్రయత్నంలో తమ తోక ద్వారా ఎలా దిక్కులు మార్చుకోగలుగుతాయో చూపించారు. దాదాపు అరగంట పాటు విహంగం విహారం గురించి చక్కగా వివరించారు. పాఠం ముగించాక అర్థంమైందా? అని అందరినీ అడిగారు. నేను ఎలాంటి సంకోచం లేకుండా నాకు అర్థం కాలేదని చెప్పాను. ఆ మాటే చాలామంది విద్యార్థులు చెప్పారు. మా సమాధానానికి మా మాస్టరు ఏమీ నిరుత్సాహపడలేదు. సహనాన్ని కోల్పోలేదు. ఆ సాయంకాలం మమ్మల్నందరినీ సముద్రతీరానికి తీసుకువెళ్ళారు. అప్పుడు అయ్యర్ గారు ఆకాశంలో గుంపులు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించారు. ఆ అద్భుతమైన పక్షి సమూహాలను చూసి మేం విభ్రాంతులమయ్యాం. వారు ఆ పక్షుల్ని చూపిస్తూ అవి అలా ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లాడిస్తున్నాయో గమనించమన్నారు. అవి తాము కోరుకున్న దిశకు తిరగడానికి తమ తోకల్ని ఎలా వాడుకుంటున్నాయో పరిశీలించమన్నారు. అప్పుడాయన మమ్మల్ని, "పక్షిని నడిపిస్తున్న ఆ యంత్రం ఎక్కడుంది? దానికి ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?” అని అడిగారు, చివరకు జవాబు కూడా ఆయనే చెప్పారు. పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తేనని, దాని ఇచ్ఛాశక్తే దాని చోదకశక్తి అని వివరించారు. అంత గహనమైన భావనల్ని ఆయన మా కళ్ళెదుట కనపడుతున్న దృష్టాంతంతో సులభంగా సరళంగా బోధపరిచారు. నా వరకూ నేను ఆ రోజు తెలుసుకున్నది. కేవలం ఒక పక్షి ఎలా ఎగురుతున్నదన్న అంశంతో ఆగిపోలేదు. ఆరోజున ఆయన చెప్పిన పాఠం నాలో విశిష్ట అనుభూతిని జాగృతం చేసింది. నేను భవిష్యత్తులో చదువుకోబోయే చదువు ఆకాశయాన వ్యవస్థలకు సంబంధించి ఉండాలని తీర్మానించుకున్నాను. ఒక సాయంకాలం పాఠశాల ముగిసిన తరువాత నా మనస్సులోని మాటను...................© 2017,www.logili.com All Rights Reserved.