డాక్టర్ చేకూరి రామారావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర శాఖ లో ఆచార్యులుగా ఉన్నారు. ఆధునిక భాషాశాస్త్ర రంగములో Noam Chomsky పరివర్తన సిద్దాంతాన్ని (Transformational Theory) ప్రతిపాదించి కొత్త విప్లవాన్ని తీసుకొని వచ్చినారు. ఆ సిద్ధాంతం వెలుగులో మొదటిసారిగా తెలుగు వాక్యాన్ని విశ్లేషించే ప్రయత్నం రామారావుగారు చేసినారు. 'A Transformational study of telugu nominals' అనే అంశము పైన పరిశోధన చేసి పిహెచ్.డి పొందినారు. తరువాత 'భారతి' లో 'నామ్నీకరణలు' (Nominalization) పేరిట వారు ప్రకటించిన వ్యాసాలు తెలుగు భాషా రంగంలో ఆసక్తిని కలిగించినవి. తెలుగు వాక్యానికి సంబంధించి వారి పరిశోధనా వ్యాసాలు అనేకం పత్రికలలో, సంకలనాలలో ప్రకటితాలు. వాటిలో ముఖ్యమైన వ్యాసాలను 'తెలుగులో వెలుగులు' అనే పేరిట సంకలనంగా ఇప్పుడు మీముందుకు.
తెలుగు భాషా నిర్మాణ ప్రయోగాలను శాస్త్రీయ పద్దతులలో వివరించే ప్రామాణికమైన రిఫరెన్స్ గ్రంధాలు లేని కొరతను ఈ సంపుటి చాలా వరకు తీరుస్తుంది.
డాక్టర్ చేకూరి రామారావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర శాఖ లో ఆచార్యులుగా ఉన్నారు. ఆధునిక భాషాశాస్త్ర రంగములో Noam Chomsky పరివర్తన సిద్దాంతాన్ని (Transformational Theory) ప్రతిపాదించి కొత్త విప్లవాన్ని తీసుకొని వచ్చినారు. ఆ సిద్ధాంతం వెలుగులో మొదటిసారిగా తెలుగు వాక్యాన్ని విశ్లేషించే ప్రయత్నం రామారావుగారు చేసినారు. 'A Transformational study of telugu nominals' అనే అంశము పైన పరిశోధన చేసి పిహెచ్.డి పొందినారు. తరువాత 'భారతి' లో 'నామ్నీకరణలు' (Nominalization) పేరిట వారు ప్రకటించిన వ్యాసాలు తెలుగు భాషా రంగంలో ఆసక్తిని కలిగించినవి. తెలుగు వాక్యానికి సంబంధించి వారి పరిశోధనా వ్యాసాలు అనేకం పత్రికలలో, సంకలనాలలో ప్రకటితాలు. వాటిలో ముఖ్యమైన వ్యాసాలను 'తెలుగులో వెలుగులు' అనే పేరిట సంకలనంగా ఇప్పుడు మీముందుకు. తెలుగు భాషా నిర్మాణ ప్రయోగాలను శాస్త్రీయ పద్దతులలో వివరించే ప్రామాణికమైన రిఫరెన్స్ గ్రంధాలు లేని కొరతను ఈ సంపుటి చాలా వరకు తీరుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.