ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసినా నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరిపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జనాల నాలుకలపై నడవాడిన పద్యాలు ఈ నాటక ప్రాశస్త్యానికి నిదర్శనం కాగా నటరత్న నందమూరి తారక రామారావుగారు దర్శకత్వం వహించిన 'కర్ణ' చిత్రంలోని రాయభార ఘట్టంలో తన హావభావాలలో ఈ పద్యాలకు మరింత ప్రాణప్రతిష్ట తెచ్చి కవులకు తనకు జనహృదయాలలో స్థానం సంపాదించిన మేటి నాటకం "ఈ పాండవోద్యోగం".
ఇందులో వచ్చు పాత్రలు: సుత్రాధారుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, ద్రౌపది, గాంధారి, కుంతి, ఇంకా అనేక అనేక పాత్రలు పౌరాణిక పద్య నాటకాన్ని తలపిస్తాయి.
- తిరుపతి వేంకట కవులు
రచయిత గురించి
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (జననం 1870). దివాకర్ల తిరుపతిశాస్త్రి (జననం 1872). వీరిద్దరూ కలసి జంట కవులుగా ప్రసిద్దులై ఎన్నో ఆస్థానాలు సందర్శించి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఎంతో ఘనకీర్తి గడించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి తన తర్వాతి రచనలను కూడా తిరుపతి వెంకట కవులుగానే రచించి, ప్రచురించడం వీరి మైత్రీ బంధానికి ప్రతీక. తిరుపతి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాప్రపూర్ణ బిరుదు పొందడమేకాక మద్రాసు రాష్ట ప్రధమ తెలుగు ఆస్థానకవి.
ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసినా నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరిపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జనాల నాలుకలపై నడవాడిన పద్యాలు ఈ నాటక ప్రాశస్త్యానికి నిదర్శనం కాగా నటరత్న నందమూరి తారక రామారావుగారు దర్శకత్వం వహించిన 'కర్ణ' చిత్రంలోని రాయభార ఘట్టంలో తన హావభావాలలో ఈ పద్యాలకు మరింత ప్రాణప్రతిష్ట తెచ్చి కవులకు తనకు జనహృదయాలలో స్థానం సంపాదించిన మేటి నాటకం "ఈ పాండవోద్యోగం". ఇందులో వచ్చు పాత్రలు: సుత్రాధారుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, ద్రౌపది, గాంధారి, కుంతి, ఇంకా అనేక అనేక పాత్రలు పౌరాణిక పద్య నాటకాన్ని తలపిస్తాయి. - తిరుపతి వేంకట కవులు రచయిత గురించి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (జననం 1870). దివాకర్ల తిరుపతిశాస్త్రి (జననం 1872). వీరిద్దరూ కలసి జంట కవులుగా ప్రసిద్దులై ఎన్నో ఆస్థానాలు సందర్శించి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఎంతో ఘనకీర్తి గడించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి తన తర్వాతి రచనలను కూడా తిరుపతి వెంకట కవులుగానే రచించి, ప్రచురించడం వీరి మైత్రీ బంధానికి ప్రతీక. తిరుపతి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాప్రపూర్ణ బిరుదు పొందడమేకాక మద్రాసు రాష్ట ప్రధమ తెలుగు ఆస్థానకవి.
© 2017,www.logili.com All Rights Reserved.