ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా మనదేశం బానిసత్వపు సంకెళ్ళ నుండి విడిపడి స్వాతంత్ర్యం పొందినది. ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ 150వ ఉత్సవాన్ని యావత్ భారత్ జాతి ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నది.
మనం రాజ్యాంగం ద్వారా స్వేచ్చ సమానత్వం, సాంఘిక న్యాయ సాధన మన ఆశయాలుగా ఏర్పరచుకోన్నాం. అవి పొందడానికి అనేక చట్టాలను మన చట్ట సభలు చేసినవి. రాచరిక వ్యవస్థను, జమీందారీ, ఈనాంల రద్దు, భూ సంస్కరణల అమలు, పేదలకు, దళితులకు భూముల పంపిణి, ఆ అస్సైన్డ్ భూముల బదిలీ నిషేధం వంటివి కొన్ని ముఖ్యమైన చట్టాలు. అందులో ముఖ్య చట్టాలను, భూసేకరణ చట్టం అంశాలను, భూమి వినియోగం మార్పు చట్ట్టం, ఆర్.ఓ.ఆర్., వాల్టా చట్టాల అంశాలను, ఆంధ్రా తెలంగాణా ఎండోమెంట్ కౌలు చట్టాలను తీర్పులను ఇందుల చేర్చినాము.
గ్రామ స్థాయిలో భూమి, రెవిన్యూ మొదలగు అంశాలపై ప్రభుత్వపరంగా పనులు చేయడానికి గ్రామ రెవిన్యూ వ్యవస్థని ఎ.పి. ప్రభుత్వం ప్రవేశపెట్టి VRO ల నియామకం చేపట్టింది. రెవిన్యూ సిబ్బందికీ, VRO లకు, గ్రామ సేవకులకు చెందిన సర్విస్ రూల్స్ ని ఈ పుస్తకంలో చేర్చాము.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రజలు భూమి, రెవిన్యూ, పౌరసరఫరా, మేజిస్టిరియల్ వ్యవహారాలపై మంచి అవగాహన పెంచుకోవడానికి వీలుగా ఆయా చట్టాలను, వాటి క్రింద తయారు చేసిన రూల్స్, ముఖ్య జి.వో.లను తెలుగులో వ్రాశాము.
ఈ పుస్తకంలో వ్రాసిన అంశాలను చదివి అవగాహన చేసికుంటే ఉద్యోగులు తమ విధుల నిర్వహణకు, ప్రజలకు తమ ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణకు ఉపకరిస్తుంది. ఈ పుస్తకం అందరికీ ఉపయోగించే విధంగా ఉండేందుకు ఇంకా అనేక చట్టాల, రూల్స్ అంశాలను చేర్చేందుకు ప్రయత్నించాం.
- వడ్లమాని వేంకట రమణ
ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా మనదేశం బానిసత్వపు సంకెళ్ళ నుండి విడిపడి స్వాతంత్ర్యం పొందినది. ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ 150వ ఉత్సవాన్ని యావత్ భారత్ జాతి ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నది. మనం రాజ్యాంగం ద్వారా స్వేచ్చ సమానత్వం, సాంఘిక న్యాయ సాధన మన ఆశయాలుగా ఏర్పరచుకోన్నాం. అవి పొందడానికి అనేక చట్టాలను మన చట్ట సభలు చేసినవి. రాచరిక వ్యవస్థను, జమీందారీ, ఈనాంల రద్దు, భూ సంస్కరణల అమలు, పేదలకు, దళితులకు భూముల పంపిణి, ఆ అస్సైన్డ్ భూముల బదిలీ నిషేధం వంటివి కొన్ని ముఖ్యమైన చట్టాలు. అందులో ముఖ్య చట్టాలను, భూసేకరణ చట్టం అంశాలను, భూమి వినియోగం మార్పు చట్ట్టం, ఆర్.ఓ.ఆర్., వాల్టా చట్టాల అంశాలను, ఆంధ్రా తెలంగాణా ఎండోమెంట్ కౌలు చట్టాలను తీర్పులను ఇందుల చేర్చినాము. గ్రామ స్థాయిలో భూమి, రెవిన్యూ మొదలగు అంశాలపై ప్రభుత్వపరంగా పనులు చేయడానికి గ్రామ రెవిన్యూ వ్యవస్థని ఎ.పి. ప్రభుత్వం ప్రవేశపెట్టి VRO ల నియామకం చేపట్టింది. రెవిన్యూ సిబ్బందికీ, VRO లకు, గ్రామ సేవకులకు చెందిన సర్విస్ రూల్స్ ని ఈ పుస్తకంలో చేర్చాము. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రజలు భూమి, రెవిన్యూ, పౌరసరఫరా, మేజిస్టిరియల్ వ్యవహారాలపై మంచి అవగాహన పెంచుకోవడానికి వీలుగా ఆయా చట్టాలను, వాటి క్రింద తయారు చేసిన రూల్స్, ముఖ్య జి.వో.లను తెలుగులో వ్రాశాము. ఈ పుస్తకంలో వ్రాసిన అంశాలను చదివి అవగాహన చేసికుంటే ఉద్యోగులు తమ విధుల నిర్వహణకు, ప్రజలకు తమ ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణకు ఉపకరిస్తుంది. ఈ పుస్తకం అందరికీ ఉపయోగించే విధంగా ఉండేందుకు ఇంకా అనేక చట్టాల, రూల్స్ అంశాలను చేర్చేందుకు ప్రయత్నించాం. - వడ్లమాని వేంకట రమణ© 2017,www.logili.com All Rights Reserved.