అయన రాసిన ఈ "భూమి పతనం " నవల అత్యంత వాస్తవికంగా రూపొందింది. ఇది అయన అనుభవంలోంచే రచించబడిన నవలలా తోచింది. ఒక పేద సన్నకారు రైతును ప్రధాన పాత్రగా తీసుకోని అతడు అనుభవించిన కష్టనష్టాలను చిత్రిస్తూ నారాయణ ఈ నవల రచించాడు. పేద రైతులకోసం ఇది చేశాం. అది చేశాం అని ప్రభుత్వం వారు ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ ఈ నవలలోని చంద్రకొండలు అనే రైతు కన్నీళ్ళను మాత్రం ఏ ప్రభుత్వ పథకాలు కూడా తీర్చకపోవడం ఈ నవలలో మనం చూస్తాం.
ఇలా ఈ నవలంతా చంద్రకొండలులాంటి సన్నకారురైతు అనుభవించే వేదనను చిత్రిస్తుంది. మత మార్పిడులు ఎందుకు జరుగుతాయో కూడా ఈ రచయిత స్పష్టంగా చెప్పాడు .