ఎన్ని మారినా పల్లెటూరి ప్రజల్లోని కొన్ని మూడనమ్మకాలూ ఈ నాటికీ కూడా మారకపోవడం చాలా భాధాకరం. విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ శతాబ్దంలో కూడా పల్లెటూరి ప్రజల్లో చేతబడులు ఉన్నాయని, దయ్యాలు, భూతాలు ఉన్నాయని, మంత్రగాళ్ళు మంత్రాలూ ప్రయోగించి తమకు గిట్టని వాళ్ళకు జబ్బులు తెప్పిస్తారని, కొన్నిసార్లు మంత్రాలూ ప్రయోగించి తమ శత్రువుల్ని చంపేస్తారని నమ్ముతుంటారు. ఇలా చేతబడి జరిగినపుడు క్షుద్ర విద్యలు నేర్చిన భూత వైధ్యుల దగ్గరకు పరిగెత్తుతుంటారు. దయ్యాలు లేవు భూతాలు లేవు భూత వైధ్యులు చేసే పనులన్నీ భూటకపు పనులు. వాళ్ల బతుకు దెరువు కోసం వాళ్ళా పనులు చేస్తున్నట్టుగా నటిస్తుంటారు. మంత్రాలూ లేవని వాళ్ళకి తెలుసని ఈ నాటికలో పురుషోత్తం లాంటి వాళ్ళు చెబితే పల్లెటూరి ప్రజలు నమ్మరు. ఈ నాటికలో అలాంటి మూడవిశ్వసాలను రచయిత పురుషోత్తం పాత్ర ద్వారా లేవని నిరూపించాడు. ఈ నాటికలోని సమ్మయ్య, సారయ్య పాత్రలు మూడవిశ్వాసాలకు ప్రతినిధులైతే, సారయ్య భార్య సుభద్ర పెద్దగా చదువుకోకపోయినా మూడవిశ్వాసాలను నమ్మదు. సుభద్ర ఎంత చెప్పినా వినకుండా సారయ్య జబ్బు చేసిన వాళ్ల కొడుకును ఎవరో చేతబడి చేసారని భావించి జంపన్న అనే మంత్రగాడి దగ్గరకు తీసికెవెళ్తాడు. జంపన్న ఏవో మంత్రాలూ చదివి ఆ పిల్లాడి చావుకు కారణం అవుతాడు...........
ఈ నాటికలో పాత్రోచిత సంభాషణలను రచయిత చక్కగా రచించాడు. తెలంగాణ మాండలికపు సొగసును మనమీ నాటికలో చూడవచ్చు. పాత్రలన్నీ సజీవంగా రూపొందాయి.
-అంపశయ్య నవీన్.
`
ఎన్ని మారినా పల్లెటూరి ప్రజల్లోని కొన్ని మూడనమ్మకాలూ ఈ నాటికీ కూడా మారకపోవడం చాలా భాధాకరం. విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ శతాబ్దంలో కూడా పల్లెటూరి ప్రజల్లో చేతబడులు ఉన్నాయని, దయ్యాలు, భూతాలు ఉన్నాయని, మంత్రగాళ్ళు మంత్రాలూ ప్రయోగించి తమకు గిట్టని వాళ్ళకు జబ్బులు తెప్పిస్తారని, కొన్నిసార్లు మంత్రాలూ ప్రయోగించి తమ శత్రువుల్ని చంపేస్తారని నమ్ముతుంటారు. ఇలా చేతబడి జరిగినపుడు క్షుద్ర విద్యలు నేర్చిన భూత వైధ్యుల దగ్గరకు పరిగెత్తుతుంటారు. దయ్యాలు లేవు భూతాలు లేవు భూత వైధ్యులు చేసే పనులన్నీ భూటకపు పనులు. వాళ్ల బతుకు దెరువు కోసం వాళ్ళా పనులు చేస్తున్నట్టుగా నటిస్తుంటారు. మంత్రాలూ లేవని వాళ్ళకి తెలుసని ఈ నాటికలో పురుషోత్తం లాంటి వాళ్ళు చెబితే పల్లెటూరి ప్రజలు నమ్మరు. ఈ నాటికలో అలాంటి మూడవిశ్వసాలను రచయిత పురుషోత్తం పాత్ర ద్వారా లేవని నిరూపించాడు. ఈ నాటికలోని సమ్మయ్య, సారయ్య పాత్రలు మూడవిశ్వాసాలకు ప్రతినిధులైతే, సారయ్య భార్య సుభద్ర పెద్దగా చదువుకోకపోయినా మూడవిశ్వాసాలను నమ్మదు. సుభద్ర ఎంత చెప్పినా వినకుండా సారయ్య జబ్బు చేసిన వాళ్ల కొడుకును ఎవరో చేతబడి చేసారని భావించి జంపన్న అనే మంత్రగాడి దగ్గరకు తీసికెవెళ్తాడు. జంపన్న ఏవో మంత్రాలూ చదివి ఆ పిల్లాడి చావుకు కారణం అవుతాడు........... ఈ నాటికలో పాత్రోచిత సంభాషణలను రచయిత చక్కగా రచించాడు. తెలంగాణ మాండలికపు సొగసును మనమీ నాటికలో చూడవచ్చు. పాత్రలన్నీ సజీవంగా రూపొందాయి. -అంపశయ్య నవీన్. `
© 2017,www.logili.com All Rights Reserved.