బాలసాహిత్యం బాలల కోసం ఏర్పడిన సాహిత్యం. ఇది ప్రౌఢ సాహిత్యం కంటే భిన్నమైనది. ఇది ప్రౌఢ సాహిత్యానికి ఛాయకాదు. సరళీకరణ అంతకంటే కాదు. అన్ని ప్రక్రియలు సంతరించుకున్న ఒక సజీవసాహితీ స్రవంతి. ప్రత్యేక సాహిత్య లక్షణాలు గల ఒక విశిష్ట సాహితీ రంగం. దేశంలో దాదాపు సగం మంది జనాభాగల పిల్లలు చదువుకొనే సాహితీ ప్రపంచం.
పాఠశాలకు వెళ్ళని దశ నుండి యవ్వనం వచ్చేవరకు బాలలు చదివే సాహిత్యాన్ని బాలసాహిత్యం అనవచ్చు. ఉత్తమ బాల సాహిత్యం పిల్లలలో చదివే ఆసక్తి పెంచుతుంది. ఆలోచన పెంచుతుంది. బిడియం పోగొడుతుంది. భాషాభిమానం పెంపొందిస్తుంది. మనో భవనపు కిటికీలు తెరచి జిజ్ఞాసను విరబూయిస్తుంది. యువతరానికి బాటలు వేస్తుంది.
యువ బాలసాహితీవేత్త దాసరి వెంకటరమణగారి కథలన్నీ ఈ కోవకు చెందినవే. ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు తదితర పత్రికల్లో ప్రచురింపబడి, విశేష ఆదరణ పొందినవే. మరల గ్రంథ రూపంలో వచ్చినందున మరల మరల చదువుకొనే అవకాశ౦ కలుగుతుంది.
ఈ కథలను కేవలం కాలక్షేపం కోసం చదువుకొనేందుకు రాయలేదు. పిల్లలు ఈ కథలను చదువుకొని, సామాజిక జీవితంలో సముచిత స్థానం ఏర్పరచుకునేందుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.
పిల్లలు తెలుసుకోవలసిన సామాజిక విషయాలను వెంకటరమణగారు దాదాపు 22 కథల ద్వారా లేదా సంఘటనల ద్వారా పిల్లల మనసులలో నాటేట్లు చెబుతారు.
- వెలగా వెంకటప్పయ్య
బాలసాహిత్యం బాలల కోసం ఏర్పడిన సాహిత్యం. ఇది ప్రౌఢ సాహిత్యం కంటే భిన్నమైనది. ఇది ప్రౌఢ సాహిత్యానికి ఛాయకాదు. సరళీకరణ అంతకంటే కాదు. అన్ని ప్రక్రియలు సంతరించుకున్న ఒక సజీవసాహితీ స్రవంతి. ప్రత్యేక సాహిత్య లక్షణాలు గల ఒక విశిష్ట సాహితీ రంగం. దేశంలో దాదాపు సగం మంది జనాభాగల పిల్లలు చదువుకొనే సాహితీ ప్రపంచం. పాఠశాలకు వెళ్ళని దశ నుండి యవ్వనం వచ్చేవరకు బాలలు చదివే సాహిత్యాన్ని బాలసాహిత్యం అనవచ్చు. ఉత్తమ బాల సాహిత్యం పిల్లలలో చదివే ఆసక్తి పెంచుతుంది. ఆలోచన పెంచుతుంది. బిడియం పోగొడుతుంది. భాషాభిమానం పెంపొందిస్తుంది. మనో భవనపు కిటికీలు తెరచి జిజ్ఞాసను విరబూయిస్తుంది. యువతరానికి బాటలు వేస్తుంది. యువ బాలసాహితీవేత్త దాసరి వెంకటరమణగారి కథలన్నీ ఈ కోవకు చెందినవే. ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు తదితర పత్రికల్లో ప్రచురింపబడి, విశేష ఆదరణ పొందినవే. మరల గ్రంథ రూపంలో వచ్చినందున మరల మరల చదువుకొనే అవకాశ౦ కలుగుతుంది. ఈ కథలను కేవలం కాలక్షేపం కోసం చదువుకొనేందుకు రాయలేదు. పిల్లలు ఈ కథలను చదువుకొని, సామాజిక జీవితంలో సముచిత స్థానం ఏర్పరచుకునేందుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. పిల్లలు తెలుసుకోవలసిన సామాజిక విషయాలను వెంకటరమణగారు దాదాపు 22 కథల ద్వారా లేదా సంఘటనల ద్వారా పిల్లల మనసులలో నాటేట్లు చెబుతారు. - వెలగా వెంకటప్పయ్య© 2017,www.logili.com All Rights Reserved.