తల్లి ఒడిలో
రాత్రిబడిలో ఆకాశం భూమి పలకమీద చినుకుకలంతో అక్షరాలు దిద్దుతుంటే ధరణి తల్లి పులకించిపోతున్న సమయం.
ఆ వేళలో... ఉన్నట్లుండి రచన మూడంకె వేసింది. అలక తీర్చటం తనవంతే అనుకున్నాడు భర్త ఆనంద్. నెమ్మదిగా ఆమె పక్కకు చేరాడు. అది గ్రహించి మరింత
ముడుచుకుందామె.
“అది కాదురా” అన్నాడు ఆనంద్.
“వద్దు ! నాకేం చెప్పద్దు !" అంటూ మరింత బిగుసుకుపోయింది. చక్కిలిగిలి పెట్టాలనే చిలిపి ఆలోచన వచ్చింది. అమ్మో అది ఇప్పుడు పనికిరాదు అనుకున్నాడు మళ్ళీ. మొదటికే మోసం వస్తుందేమో అని ఆలోచిస్తూనే మరింత దగ్గరగా జరిగాడు. “ఈ రోజు నన్నొదిలెయ్యండి" అందామె.
“నేనేం పట్టుకోవటానికి రాలేదులే! కో అంటే కోటిమంది, వెళ్ళాలే గానీ... ఏదో శ్రీరామచంద్రుడిలా ఉండాలని తపన”
అంత కోపంలో కూడా ముసిముసి నవ్వు విరిసింది ఆమె లేత పెదాలమీద. అయినా బెట్టు సడలనివ్వలేదు.
"బెడ్మీద అలక పాన్పులకు తావివ్వకూడదని ముందే ఒప్పందం చేసుకున్నాంగా”
“ఆఁ ! మంచి ఏది చెప్పినా నా మాట వింటానని మీరు కూడా ఒప్పుకున్నారు. అది ఇప్పుడు ఏమయిందట ?” లేచి మంచం మధ్యలో హఠం వేసుకొని కూర్చుని మరీ అడిగింది రచన...............
తల్లి ఒడిలో రాత్రిబడిలో ఆకాశం భూమి పలకమీద చినుకుకలంతో అక్షరాలు దిద్దుతుంటే ధరణి తల్లి పులకించిపోతున్న సమయం. ఆ వేళలో... ఉన్నట్లుండి రచన మూడంకె వేసింది. అలక తీర్చటం తనవంతే అనుకున్నాడు భర్త ఆనంద్. నెమ్మదిగా ఆమె పక్కకు చేరాడు. అది గ్రహించి మరింత ముడుచుకుందామె. “అది కాదురా” అన్నాడు ఆనంద్. “వద్దు ! నాకేం చెప్పద్దు !" అంటూ మరింత బిగుసుకుపోయింది. చక్కిలిగిలి పెట్టాలనే చిలిపి ఆలోచన వచ్చింది. అమ్మో అది ఇప్పుడు పనికిరాదు అనుకున్నాడు మళ్ళీ. మొదటికే మోసం వస్తుందేమో అని ఆలోచిస్తూనే మరింత దగ్గరగా జరిగాడు. “ఈ రోజు నన్నొదిలెయ్యండి" అందామె. “నేనేం పట్టుకోవటానికి రాలేదులే! కో అంటే కోటిమంది, వెళ్ళాలే గానీ... ఏదో శ్రీరామచంద్రుడిలా ఉండాలని తపన” అంత కోపంలో కూడా ముసిముసి నవ్వు విరిసింది ఆమె లేత పెదాలమీద. అయినా బెట్టు సడలనివ్వలేదు. "బెడ్మీద అలక పాన్పులకు తావివ్వకూడదని ముందే ఒప్పందం చేసుకున్నాంగా” “ఆఁ ! మంచి ఏది చెప్పినా నా మాట వింటానని మీరు కూడా ఒప్పుకున్నారు. అది ఇప్పుడు ఏమయిందట ?” లేచి మంచం మధ్యలో హఠం వేసుకొని కూర్చుని మరీ అడిగింది రచన...............© 2017,www.logili.com All Rights Reserved.