ఒక స్త్రీ వివాహంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పురుషుని వల్ల తల్లి కావాలనుకుంటే ఏమవుతుంది? కుదురుతుందా? ఇది కూడా వర్గం, కులం మొదలైన వాటికి లోబడే ఉంటుంది. ఉన్నత వర్గ స్త్రీలు అలా చేసి సమాజంలో పెద్ద వ్యతిరేకత లేకుండానే జీవించగలుగుతున్నారు. మధ్య తరగతి స్త్రీలకు ఇది సమస్యగా ఉంటుంది. ఆ మధ్యతరగతి నుంచి ఒక 'శారద' తనకు నచ్చిన పురుషున్ని సూటిగా ఈ మాట అడగటమే ఈ నవలలోని ప్రధానంశం.
'అమ్మ' 'మాతృమూర్తి' 'మాతృత్వం' వీటి చుట్టూ ఎన్నో భావాలు, ఆలోచనలు. ఎంతో గ్లోరిఫికేషన్. తల్లి కావటమనేది మానవులలో తప్ప మిగిలిన ప్రాణులలో సహజ శారీరక విషయం. మానవులు జోక్యం చేసుకొని మిగిలిన ప్రాణుల సంతాన నియంత్రణ కూడా చేస్తున్న కాలం ఇది. కాబట్టి వాటిలో కూడా అది సహజ విషయంగా లేకుండా పోతుంది. మానవులలో అమ్మ కావటం, మాతృత్వం అనేది ఇంకా ఎంత మాత్రమూ సహజ విషయంగా లేదు. అది సాంఘిక, రాజకీయ విషయం అని ఫెమినిస్టులు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమనిపించింది. కానీ తరచి ఆలోచిస్తే అదే నిజమని అర్థమైంది.
- అక్కినేని కుటుంబరావు
ఒక స్త్రీ వివాహంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పురుషుని వల్ల తల్లి కావాలనుకుంటే ఏమవుతుంది? కుదురుతుందా? ఇది కూడా వర్గం, కులం మొదలైన వాటికి లోబడే ఉంటుంది. ఉన్నత వర్గ స్త్రీలు అలా చేసి సమాజంలో పెద్ద వ్యతిరేకత లేకుండానే జీవించగలుగుతున్నారు. మధ్య తరగతి స్త్రీలకు ఇది సమస్యగా ఉంటుంది. ఆ మధ్యతరగతి నుంచి ఒక 'శారద' తనకు నచ్చిన పురుషున్ని సూటిగా ఈ మాట అడగటమే ఈ నవలలోని ప్రధానంశం. 'అమ్మ' 'మాతృమూర్తి' 'మాతృత్వం' వీటి చుట్టూ ఎన్నో భావాలు, ఆలోచనలు. ఎంతో గ్లోరిఫికేషన్. తల్లి కావటమనేది మానవులలో తప్ప మిగిలిన ప్రాణులలో సహజ శారీరక విషయం. మానవులు జోక్యం చేసుకొని మిగిలిన ప్రాణుల సంతాన నియంత్రణ కూడా చేస్తున్న కాలం ఇది. కాబట్టి వాటిలో కూడా అది సహజ విషయంగా లేకుండా పోతుంది. మానవులలో అమ్మ కావటం, మాతృత్వం అనేది ఇంకా ఎంత మాత్రమూ సహజ విషయంగా లేదు. అది సాంఘిక, రాజకీయ విషయం అని ఫెమినిస్టులు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమనిపించింది. కానీ తరచి ఆలోచిస్తే అదే నిజమని అర్థమైంది. - అక్కినేని కుటుంబరావు© 2017,www.logili.com All Rights Reserved.