కవితని పరిభషించడానికి నిరంతరం ప్రయాస జరుగుతూనే వుంది. కాని దీన్ని కొలవడానికి ఏరకమైన యంత్రాన్నీ ఈ రోజు వరకూ ఎవరూ కనుగొనలేదు. ఎందుకంటే కవిత కేవలం కవితగానే యుంటుంది. ఉన్నదేదో కవితే లేకపోతే కవితే కాదు. కవితలో మంచిది - చెడ్డది, శ్రేష్ఠమైనది - నికృష్ఠమైనది, సహజమైనది లేక అధమమైనది అని ఏమీ యుండదు. లయ, తాల, ప్రాస, యతి ఛందోబద్ధంగా వున్నవే కవితలు మిగతావి కానేకావు అనడానికి వీలూ లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు లయ, తాల, ఛంద, యతి, ప్రాసబద్ధంగా వ్రాసే ప్రయాసలో కవిత పీక పిసకడం కూడ జరిగింది, జరుగుతూంది.
- పారనంది నిర్మల
విశ్రాంత్ వశిష్ఠ కవిత గురించి మాట్లాడుతూ
కవిత అంటే ఏమిటి?
ఏమీ కాదు
మరుగు తున్నా పాలు
పొంగి పోయిం తరువాత
పాత్ర లో మిగిలినవే పాలు.
అని అన్నారు.