ఒక ముళ్ళపంది తన ఇంటికి వెళుతోంది. దారిలో ఒక కుందేలు దానికి కలిసింది. తోడు దొరకటంతో వాటికి అలసట తెలియటం లేదు. అందుకే అవి రెట్టింపు వేగంతో నడుస్తున్నాయి కూడా. ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది. రెండూ కలిసి మాట్లాడుకుంటూ చకచకా వెళుతున్నాయి. దారిలో ఒక కర్ర పడి ఉంది. మాటల సందట్లో కుందేలు కర్రను చూడలేదు. కాలికి తగిలి తూలి కింద పడినంత పనయ్యింది. "హు!" కోపంగా కర్రను కాలితో తన్ని పక్కకు నెట్టేసింది కుందేలు. కాని ముళ్ళపంది ఆ కర్రను తీసి భుజాన వేసుకొని కుందేలు వెనక పరిగెత్తింది. అది చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. "ఆ కర్ర ఎందుకు పనికొస్తుందని తీసుకోస్తున్నావు? అని అడిగింది. "ఇది మామూలు కర్ర కాదు. మహిమగల కర్ర," అని ముళ్ళపంది సమాధానం ఇచ్చింది. అది విన్న కుందేలు ముక్కు విరిచింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఒక ముళ్ళపంది తన ఇంటికి వెళుతోంది. దారిలో ఒక కుందేలు దానికి కలిసింది. తోడు దొరకటంతో వాటికి అలసట తెలియటం లేదు. అందుకే అవి రెట్టింపు వేగంతో నడుస్తున్నాయి కూడా. ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది. రెండూ కలిసి మాట్లాడుకుంటూ చకచకా వెళుతున్నాయి. దారిలో ఒక కర్ర పడి ఉంది. మాటల సందట్లో కుందేలు కర్రను చూడలేదు. కాలికి తగిలి తూలి కింద పడినంత పనయ్యింది. "హు!" కోపంగా కర్రను కాలితో తన్ని పక్కకు నెట్టేసింది కుందేలు. కాని ముళ్ళపంది ఆ కర్రను తీసి భుజాన వేసుకొని కుందేలు వెనక పరిగెత్తింది. అది చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. "ఆ కర్ర ఎందుకు పనికొస్తుందని తీసుకోస్తున్నావు? అని అడిగింది. "ఇది మామూలు కర్ర కాదు. మహిమగల కర్ర," అని ముళ్ళపంది సమాధానం ఇచ్చింది. అది విన్న కుందేలు ముక్కు విరిచింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.