'పెళ్లి కుదిరేనా...?' ప్రేమలు - పెళ్ళిళ్ళు కథా వస్తువుగా గల నవలే. రజనీ, సమీర, ప్రదీప్, అభిలాష,... వీరందరూ జేన్ ఆస్టిన్ నవలల్లోనూ జంటకట్టిన... కట్టాలనుకుంటున్న బొమ్మలే. కానైతే ఆస్టిన్ పాత్రల్లా వీరు సెంటిమెంటల్ క్రీచర్లు కారు. డౌన్ టు ఎర్త్ ఫిలాసఫీ వీరిది. ఈ కాలానికి అనుగుణమైన ప్రాక్టికల్ ధోరణులు వీరివి. వీరి కథలను నడిపించేవి మనస్తత్వపు వికారాలు కాదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు.
స్కూల్లో మా తోటి ఉపాధ్యాయిని చెప్పిందో సారి... "మా తమ్ముడి పెళ్లి చూపులకి వెళ్ళాం. అక్కడ పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి వింతగా ప్రవర్తించింది. చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగింది. మా తమ్ముణ్ణి. ఎంతో షాక్ అయ్యాం అందరం" అంటూ వివరాలు చెప్పింది. ఆడపిల్ల పెళ్లి చూపుల్లో అంత ధైర్యంగా ప్రవర్తించడం వెనుక ఏదో అంతరార్థం ఉంటుందనిపిస్తుంది నాకు. కొన్నాళ్ళు అదే ఆలోచన... ఫలితం ఈ చిన్న నవల.
- (కాపా)వల్లూరుపల్లి లక్ష్మి
'పెళ్లి కుదిరేనా...?' ప్రేమలు - పెళ్ళిళ్ళు కథా వస్తువుగా గల నవలే. రజనీ, సమీర, ప్రదీప్, అభిలాష,... వీరందరూ జేన్ ఆస్టిన్ నవలల్లోనూ జంటకట్టిన... కట్టాలనుకుంటున్న బొమ్మలే. కానైతే ఆస్టిన్ పాత్రల్లా వీరు సెంటిమెంటల్ క్రీచర్లు కారు. డౌన్ టు ఎర్త్ ఫిలాసఫీ వీరిది. ఈ కాలానికి అనుగుణమైన ప్రాక్టికల్ ధోరణులు వీరివి. వీరి కథలను నడిపించేవి మనస్తత్వపు వికారాలు కాదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు. స్కూల్లో మా తోటి ఉపాధ్యాయిని చెప్పిందో సారి... "మా తమ్ముడి పెళ్లి చూపులకి వెళ్ళాం. అక్కడ పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి వింతగా ప్రవర్తించింది. చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగింది. మా తమ్ముణ్ణి. ఎంతో షాక్ అయ్యాం అందరం" అంటూ వివరాలు చెప్పింది. ఆడపిల్ల పెళ్లి చూపుల్లో అంత ధైర్యంగా ప్రవర్తించడం వెనుక ఏదో అంతరార్థం ఉంటుందనిపిస్తుంది నాకు. కొన్నాళ్ళు అదే ఆలోచన... ఫలితం ఈ చిన్న నవల. - (కాపా)వల్లూరుపల్లి లక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.