ఒక చీమ ఒక రోజు వర్షంలో చిక్కుకుంది. ఎక్కడ తలదాచుకోవాలి?. చటుక్కున ఒక పుట్టగొడుగును చూసింది. పరుగెత్తి దాని కింద దూరింది. వాన ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తూ కూర్చుంది. ఒక సీతాకొక చిలుక తడిసిపోయి మెల్లగా అక్కడకు చేరుకుంది. "చీమా! నేను తడిసి ముద్ద కావటం వల్ల ఎగరలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ పుట్టగొడుగు కింద ఉండనివ్వు?" అంది. "నాకే ఇరుకుగా వుంది. ఇంకా నీకు చోటెక్కడిది?" అంది చీమ. "ఫరవాలేదు. ఇద్దరమూ కలిసుంటే వెచ్చగా ఉంటుంది" అంది సీతాకోకచిలుక. 'సరే' అని రెండూ సర్దుకు కూర్చున్నాయి. ఇంకా వాన కురుస్తూనే ఉంది. ఇంతలో ఒక ఎలుక అటుగా వచ్చింది. "నా వళ్ళంతా ఎక్కడా పొడి లేకుండా తడిసిపోయింది. నన్ను కూడా మీతో పాటు ఉండనివ్వరా?" అని అడిగింది ఆ ఎలుక. "కానీ చోటు లేదు గదా?". "కొంచెం జరగండి." అవి రెండూ కొంచెం జరిగి ఎలుకకు చోటిచ్చాయి. ఎడతెరిపి వాన పడుతూనే ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
ఒక చీమ ఒక రోజు వర్షంలో చిక్కుకుంది. ఎక్కడ తలదాచుకోవాలి?. చటుక్కున ఒక పుట్టగొడుగును చూసింది. పరుగెత్తి దాని కింద దూరింది. వాన ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తూ కూర్చుంది. ఒక సీతాకొక చిలుక తడిసిపోయి మెల్లగా అక్కడకు చేరుకుంది. "చీమా! నేను తడిసి ముద్ద కావటం వల్ల ఎగరలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ పుట్టగొడుగు కింద ఉండనివ్వు?" అంది. "నాకే ఇరుకుగా వుంది. ఇంకా నీకు చోటెక్కడిది?" అంది చీమ. "ఫరవాలేదు. ఇద్దరమూ కలిసుంటే వెచ్చగా ఉంటుంది" అంది సీతాకోకచిలుక. 'సరే' అని రెండూ సర్దుకు కూర్చున్నాయి. ఇంకా వాన కురుస్తూనే ఉంది. ఇంతలో ఒక ఎలుక అటుగా వచ్చింది. "నా వళ్ళంతా ఎక్కడా పొడి లేకుండా తడిసిపోయింది. నన్ను కూడా మీతో పాటు ఉండనివ్వరా?" అని అడిగింది ఆ ఎలుక. "కానీ చోటు లేదు గదా?". "కొంచెం జరగండి." అవి రెండూ కొంచెం జరిగి ఎలుకకు చోటిచ్చాయి. ఎడతెరిపి వాన పడుతూనే ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.