ప్రపంచ వివాహ వ్యవస్థలో భారతీయ వివాహ వ్యవస్థ చాలా విశిష్ఠత కలిగియున్నది, ఇందులో పురుషులు సచ్ఛిీలత, స్త్రీలు పాతివ్రత్యమును కలిగియుండవలెనని పూర్వులైన మన మహర్షులు ఎన్నో ధర్మములను స్త్రీ, పురుషుల కొరకు ప్రతిపాదించినారు.
మహర్షులు ప్రతిపాదించిన ధర్మములను పాటించుటవలన స్త్రీ పురుషులకు సమాజములో సమున్నతమైన గౌరవము, ఇహలోకమున సకల సౌఖ్యములూ పరలోకమున మోక్షము కూడా కలుగును.
నేడు విదేశీయులు కూడా భారతీయ వివాహ వ్యవస్థ పై ఎంతో ఆసక్తి కనపరచుచున్నారు. ఎందు కనగా స్త్రీ జీవితాంతము ఒకే పురుషుని భర్తగా కలిగియుండుటయూ, మరియూ పురుషుడు కూడా ఒక భార్య ఉండగా మరియొక స్త్రీతో సంబంధము లేకుండుట ఇవి మన సాంప్రదాయము. ఈ సాంప్రదాయము ప్రపంచములోని జనులందరకూ ఆదర్శ ప్రాయముగా నున్నది. అందువలననే ఇతర సాంప్రదాయములలో ఒకసారి వివాహమైనవారు కూడా అనగా అదే దంపతులు తిరిగి మన సంప్రదాయ పద్ధతిలో వివాహము చేసుకొనుచున్నారు.
- ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ