తెలుగునేల పై పరిడవిల్లిన రోటి పచ్చళ్ళ రుచి కాలక్రమంలో మిక్సీ పచ్చళ్ళ రుచిగా మారిపోయింది. రోళ్ళు కాస్తా... కుండలు, బిందెలు పెట్టుకోవడానికి కుదుళ్లుగా మారిపోయాయి. చాలా ఇళ్ళలో అవి ఎప్పుడో అటక ఎక్కేశాయి. రోళ్ళు, రోకళ్ళు అనేవి... ఎప్పుడో ఏదన్నా శుభకార్యానికి వాడుకునే వస్తువులు అయిపోయిన నేపథ్యంలో రోటిపచ్చళ్ళ ఉద్యమం మొదలైంది. రోటి పచ్చళ్ళు నేను కనిపెట్టినవి కావు. మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నవి. వాటిని పునశ్చరణ చేసుకునే ప్రయత్నంలోనే ఈ ఉద్యమం. ఈ పుస్తకం.
ఈ ప్రయత్నం ఫలించి... దేశదేశాల్లోని తెలుగువారి వంటిల్లలోకి రోళ్ళు మళ్ళీ ప్రవేశించాయి. ఇప్పటిదాకా అనేక వంటల పుస్తకాలు వచ్చాయి. రోటి పచ్చళ్ళ పుస్తకాలతో సహా. కానీ వంటల పుస్తకాలను ఏ ఒక్కరో రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పుస్తకం నేను రాసింది కాదు. నలుగురూ తలా ఒక చేయి వేసి నూరిన పుస్తకం. ఆహారంలో భిన్న ఆచార సంప్రదాయాలను నేను గౌరవిస్తాను. అన్ని చోట్లా రోటి పచ్చళ్ళు నూరుకునే అలవాటు ఉన్నప్పటికీ, వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రకాలుగా నూరుకుంటారు. ఆ వైవిధ్యం పుస్తకంలో కనిపిస్తుంది.
తెలుగునేల పై పరిడవిల్లిన రోటి పచ్చళ్ళ రుచి కాలక్రమంలో మిక్సీ పచ్చళ్ళ రుచిగా మారిపోయింది. రోళ్ళు కాస్తా... కుండలు, బిందెలు పెట్టుకోవడానికి కుదుళ్లుగా మారిపోయాయి. చాలా ఇళ్ళలో అవి ఎప్పుడో అటక ఎక్కేశాయి. రోళ్ళు, రోకళ్ళు అనేవి... ఎప్పుడో ఏదన్నా శుభకార్యానికి వాడుకునే వస్తువులు అయిపోయిన నేపథ్యంలో రోటిపచ్చళ్ళ ఉద్యమం మొదలైంది. రోటి పచ్చళ్ళు నేను కనిపెట్టినవి కావు. మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నవి. వాటిని పునశ్చరణ చేసుకునే ప్రయత్నంలోనే ఈ ఉద్యమం. ఈ పుస్తకం. ఈ ప్రయత్నం ఫలించి... దేశదేశాల్లోని తెలుగువారి వంటిల్లలోకి రోళ్ళు మళ్ళీ ప్రవేశించాయి. ఇప్పటిదాకా అనేక వంటల పుస్తకాలు వచ్చాయి. రోటి పచ్చళ్ళ పుస్తకాలతో సహా. కానీ వంటల పుస్తకాలను ఏ ఒక్కరో రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పుస్తకం నేను రాసింది కాదు. నలుగురూ తలా ఒక చేయి వేసి నూరిన పుస్తకం. ఆహారంలో భిన్న ఆచార సంప్రదాయాలను నేను గౌరవిస్తాను. అన్ని చోట్లా రోటి పచ్చళ్ళు నూరుకునే అలవాటు ఉన్నప్పటికీ, వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రకాలుగా నూరుకుంటారు. ఆ వైవిధ్యం పుస్తకంలో కనిపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.