'సావిత్రి' చదివారా?
ఆ చదివాను.
పుస్తకం మొత్తం చదివారా?
ఒక్కసారి కాదు.. రెండు సార్లు చదివాను.
అర్థమయిందా?
పూర్తిగా అర్థంకాలేదు. కాని, చదువుతుంటే ఏదో ఆనందం కలిగింది.
మామూలు పుస్తకాలు చదివినట్లు సావిత్రిని చదవకూడదు. చదివే ముందు మనస్సును 'శూన్యం' చేసుకోవాలి. మనస్సులోకి ఏ ఇతర ఆలోచనలు చొరబడకూడదు. మనస్సు నిర్మలం అయితే చదివింది 'అధ్యయనం' అవుతుంది. ఏ శ్రమ లేకుండా ఆధ్యాత్మిక సత్యాలన్నీ అర విరిసిన అరవిందాలవుతాయి.
నేను సావిత్రిని ఒకసారి కాదు, ఏడుసార్లు చదివాను. ఏడు సంవత్సరాలు యజ్ఞ దీక్షతో చదివాను. నేను మాస్టర్ సి వి వి గారి యోగంలో 'తీర్థం' పుచ్చుకున్న తొలినాళ్ళలోనే సావిత్రి నా చేతికి వచ్చింది. నా యోగం ఎంత శ్రద్ధగా చేశానో, సావిత్రిని అంత శ్రద్ధగా అధ్యయనం చేయసాగాను. నా యోగాభివృద్ధికి సావిత్రి అధ్యయనం బలాన్నిచ్చిందనడం పచ్చి సత్యం. అందుకే నాకు మాస్టర్ గారి యోగం ఒక ప్రాణం అయితే, సావిత్రి రెండవ ప్రాణం అయింది.
యోగసాధన చేస్తున్న వారికోసం 'ఆంద్ర మహా సావిత్రి' కొత్త వాకిళ్లు తెరుస్తుంది. మంచి ఆలోచనలు కలగాలంటే ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఓపెన్ మైండ్ తో సావిత్రిని చదవాలి. అధ్యయనం చేయాలి. నిత్యం పారాయణ చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకటి రెండు పేజీలు చదివినా చాలు. చదివిన తర్వాత కళ్ళు మూసుకుని అంతర్ముఖులు కావాలి. అంతర్యామిని అనుభూతించాలి, శూన్యం కావాలి.
- శార్వరి
'సావిత్రి' చదివారా? ఆ చదివాను. పుస్తకం మొత్తం చదివారా? ఒక్కసారి కాదు.. రెండు సార్లు చదివాను. అర్థమయిందా? పూర్తిగా అర్థంకాలేదు. కాని, చదువుతుంటే ఏదో ఆనందం కలిగింది. మామూలు పుస్తకాలు చదివినట్లు సావిత్రిని చదవకూడదు. చదివే ముందు మనస్సును 'శూన్యం' చేసుకోవాలి. మనస్సులోకి ఏ ఇతర ఆలోచనలు చొరబడకూడదు. మనస్సు నిర్మలం అయితే చదివింది 'అధ్యయనం' అవుతుంది. ఏ శ్రమ లేకుండా ఆధ్యాత్మిక సత్యాలన్నీ అర విరిసిన అరవిందాలవుతాయి. నేను సావిత్రిని ఒకసారి కాదు, ఏడుసార్లు చదివాను. ఏడు సంవత్సరాలు యజ్ఞ దీక్షతో చదివాను. నేను మాస్టర్ సి వి వి గారి యోగంలో 'తీర్థం' పుచ్చుకున్న తొలినాళ్ళలోనే సావిత్రి నా చేతికి వచ్చింది. నా యోగం ఎంత శ్రద్ధగా చేశానో, సావిత్రిని అంత శ్రద్ధగా అధ్యయనం చేయసాగాను. నా యోగాభివృద్ధికి సావిత్రి అధ్యయనం బలాన్నిచ్చిందనడం పచ్చి సత్యం. అందుకే నాకు మాస్టర్ గారి యోగం ఒక ప్రాణం అయితే, సావిత్రి రెండవ ప్రాణం అయింది. యోగసాధన చేస్తున్న వారికోసం 'ఆంద్ర మహా సావిత్రి' కొత్త వాకిళ్లు తెరుస్తుంది. మంచి ఆలోచనలు కలగాలంటే ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఓపెన్ మైండ్ తో సావిత్రిని చదవాలి. అధ్యయనం చేయాలి. నిత్యం పారాయణ చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకటి రెండు పేజీలు చదివినా చాలు. చదివిన తర్వాత కళ్ళు మూసుకుని అంతర్ముఖులు కావాలి. అంతర్యామిని అనుభూతించాలి, శూన్యం కావాలి. - శార్వరి© 2017,www.logili.com All Rights Reserved.