నాడు పెద్దల మాట చద్ది మూట అంటే నేడు పాత చింతకాయ పచ్చడి అని అంటే మరెలా? పెద్దలు మౌనాన్ని ఆశ్రయిస్తే మంచి మాట చెప్పేవారెవరు?
నడక నేర్పిననాడే నడత కూడా నేర్పాలని సూత్రం పాటిస్తే మనిషి మహోన్నతడు అవుతాడు. తల్లిదండ్రులు తమ పెంపకంలో మెళుకువలు పాటించి చిన్నారులను తీర్చి దిద్దగలిగితే బాల్యంలోనే బంగారు భవిష్యత్ కు బాట పడుతుంది. యవ్వనమొక అద్దం లాంటిది. అస్పష్ట చిత్రాలెన్నో అక్కడ ఫ్రేమ్ కట్టుకోవాలనుకుంటాయి. స్పష్టమైన అవగాహనా పెంచకపోతే బ్రతుకు చిత్రం చెదిరి పోతుంది.
దాంపత్యానికి పునాది పెళ్లి. అయితే ఎక్కడో అక్కడ బీటలువారుతున్న దాంపత్యసౌధం గుండెను కలుక్కుమనిపించక మానదు. మన మనసుకు మనం మరిచిపోయిన పాఠలని గుర్తు చేస్తూనే ఉండాలి. వ్యక్తిత్వం వికసించాలంటే మనసు పరిమళించాలి. భార్యాభర్తల బాట ఒకటైతేనే గమ్యం సుగమం.
మరలిపోయిన వసంతం రాదనుకుని దిగులు పడితే వృద్దాప్యం మరింత భారమనిపిస్తుంది. వణుకుతున్న చేతికి ఆలంబన కావాలి. నాడు తమ చేతిని పట్టుకుని నడిపిన ఆ చేతికి ఈనాడు చేయి అందిస్తే ఆ ప్రకంపనలు చేతికే కాదు మనుసుకు తగుల్తాయి. బంధాలను పట్టి ఉంచేది మానవతా స్పర్శే కదా!
మనుసును కుదిప ఆలోచనలు ఎన్ని తోడి పోసినా మళ్ళి మొలకలేస్తునే ఉంటాయి. ఒక మంచి మాట ఎవరిని ప్రభావితం చేసినా పండేది బ్రతుకు బాటే కదా! బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్దాప్యం.... జీవనయానంలోని వివిధ దశలలో మనల్ని పలకరించే విభిన్న అంశాలపై సమాలోచనే ఈ వ్యాస సంకలనం.
-సి.ఉమాదేవి.
నాడు పెద్దల మాట చద్ది మూట అంటే నేడు పాత చింతకాయ పచ్చడి అని అంటే మరెలా? పెద్దలు మౌనాన్ని ఆశ్రయిస్తే మంచి మాట చెప్పేవారెవరు? నడక నేర్పిననాడే నడత కూడా నేర్పాలని సూత్రం పాటిస్తే మనిషి మహోన్నతడు అవుతాడు. తల్లిదండ్రులు తమ పెంపకంలో మెళుకువలు పాటించి చిన్నారులను తీర్చి దిద్దగలిగితే బాల్యంలోనే బంగారు భవిష్యత్ కు బాట పడుతుంది. యవ్వనమొక అద్దం లాంటిది. అస్పష్ట చిత్రాలెన్నో అక్కడ ఫ్రేమ్ కట్టుకోవాలనుకుంటాయి. స్పష్టమైన అవగాహనా పెంచకపోతే బ్రతుకు చిత్రం చెదిరి పోతుంది. దాంపత్యానికి పునాది పెళ్లి. అయితే ఎక్కడో అక్కడ బీటలువారుతున్న దాంపత్యసౌధం గుండెను కలుక్కుమనిపించక మానదు. మన మనసుకు మనం మరిచిపోయిన పాఠలని గుర్తు చేస్తూనే ఉండాలి. వ్యక్తిత్వం వికసించాలంటే మనసు పరిమళించాలి. భార్యాభర్తల బాట ఒకటైతేనే గమ్యం సుగమం. మరలిపోయిన వసంతం రాదనుకుని దిగులు పడితే వృద్దాప్యం మరింత భారమనిపిస్తుంది. వణుకుతున్న చేతికి ఆలంబన కావాలి. నాడు తమ చేతిని పట్టుకుని నడిపిన ఆ చేతికి ఈనాడు చేయి అందిస్తే ఆ ప్రకంపనలు చేతికే కాదు మనుసుకు తగుల్తాయి. బంధాలను పట్టి ఉంచేది మానవతా స్పర్శే కదా! మనుసును కుదిప ఆలోచనలు ఎన్ని తోడి పోసినా మళ్ళి మొలకలేస్తునే ఉంటాయి. ఒక మంచి మాట ఎవరిని ప్రభావితం చేసినా పండేది బ్రతుకు బాటే కదా! బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్దాప్యం.... జీవనయానంలోని వివిధ దశలలో మనల్ని పలకరించే విభిన్న అంశాలపై సమాలోచనే ఈ వ్యాస సంకలనం. -సి.ఉమాదేవి.
© 2017,www.logili.com All Rights Reserved.