గురజాడ అప్పారావు రచనల నిండా ప్రత్యేక్షమయ్యే అంశాలు రెండు - భూసురులుగా చలామణి అవుతున్న బ్రాహ్మణ సమాజ మేడిపండు స్వరూపం. సమాజంలో ఇంటా బయిటా పురుశాధిక్యతకు బలైపోతున్న మహిళల జీవితం అనేక సందర్భాల్లో వారు తిరగబడటం. ఈ సంకలనంలోని నాల్గు వ్యాసాలలోనూ రచయిత్రలు ఆ తిరుగుబాట్ల స్వరూపాన్ని పాత్రల చిత్రణను చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
మహిళలు అన్నప్పుడు మామూలు గృహిణులనే కాదు - ప్రధాన పాత్రగా ఎంచుకున్న నాయిక మధురవాణి వేశ్య. తన తప్పులేకుండా కేవలం ఆనాటి సామాజిక వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారం వేశ్యగా బతుకుతున్నా బాధితులకు సహాయం చేసే సహృదయురాలు. వంచకులకు వంచనతోనే పాఠం నేర్పగల దిట్ట. సనాతన బ్రాహ్మణులైన గిరీశం అగ్ని హోత్రావధాన్లు లుబ్డావధాన్లు రామప్పంతులు వంటి వారందరినీ ప్రతికూల పాత్రలుగా చేసి వేశ్యా జీవితం గడిపే మధురవాణిని నాయికగా చేయడంలోనే గురజాడ సాహసం తెలుస్తుంది.
గురజాడ అప్పారావు రచనల నిండా ప్రత్యేక్షమయ్యే అంశాలు రెండు - భూసురులుగా చలామణి అవుతున్న బ్రాహ్మణ సమాజ మేడిపండు స్వరూపం. సమాజంలో ఇంటా బయిటా పురుశాధిక్యతకు బలైపోతున్న మహిళల జీవితం అనేక సందర్భాల్లో వారు తిరగబడటం. ఈ సంకలనంలోని నాల్గు వ్యాసాలలోనూ రచయిత్రలు ఆ తిరుగుబాట్ల స్వరూపాన్ని పాత్రల చిత్రణను చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మహిళలు అన్నప్పుడు మామూలు గృహిణులనే కాదు - ప్రధాన పాత్రగా ఎంచుకున్న నాయిక మధురవాణి వేశ్య. తన తప్పులేకుండా కేవలం ఆనాటి సామాజిక వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారం వేశ్యగా బతుకుతున్నా బాధితులకు సహాయం చేసే సహృదయురాలు. వంచకులకు వంచనతోనే పాఠం నేర్పగల దిట్ట. సనాతన బ్రాహ్మణులైన గిరీశం అగ్ని హోత్రావధాన్లు లుబ్డావధాన్లు రామప్పంతులు వంటి వారందరినీ ప్రతికూల పాత్రలుగా చేసి వేశ్యా జీవితం గడిపే మధురవాణిని నాయికగా చేయడంలోనే గురజాడ సాహసం తెలుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.