ఒక రచయిత ఎందుకు రాస్తాడు? ఒక కళాకారుడు ఒక కళా రూపాన్ని ఎందుకు సృష్టిస్తాడు? ఈ ప్రశ్నలకు సమధానం చెప్పడం అంత తెలికేమి కాదు. ఇతర కళాకారులతో పోలిస్తే రచయితలకు ఈ ప్రశ్న ఎక్కువగా ఎదురవుతుంది. రచయిత నిబద్దత, నిమగ్నతలపై ప్రశ్నలు గుప్పిస్తుంటారు. మనిషి రాజకీయ అభిప్రాయాలూ, అవసరాలకు అనుగుణంగా సాహిత్యం కూడా ఉండాలన్నా ఆలోచనా విధానం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. సమాజం వర్గాలుగా విభాజితమై ఉన్నప్పుడు రచయిత ఏ వైపు ఉన్నడన్నా ప్రశ్న వేసుకుని ఒక వైపుకు పరిమితం చేసి తిరస్కరించే ప్రయత్నమూ జరుగుతుంది.
పాఠకుల అభిరుచులు, అభిప్రాయాలూ కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. ఏ రచయితా పాఠకులనందరిని ఒకే విధంగా మెప్పించగలగడం అసాధ్యం.
ఆధునిక తెలుగు కథా, నవలా సాహిత్యంలో తనదైన శైలితో ప్రత్యేకతను సంతరించుకున్న రచయిత శ్రీ కాకాని చక్రపాణి. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను ఆత్మీయతను బంధాలను హృద్యమైన శైలిలో రూపు దిద్దగల శిల్పి ఆయన....శ్రీ చక్రపాణి నవలలు నేల విడిచి సాము చెయ్యవు. అవి మనకు ఎంతో సుపరిచితాలనిపిస్తాయి. అవిశ్రాంతంగా సాగుతున్న ఆయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కథలు, లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు. వీటన్నిటినీ గురించి వివరించునదే ఈ గ్రంథం.
-రచయిత.
ఒక రచయిత ఎందుకు రాస్తాడు? ఒక కళాకారుడు ఒక కళా రూపాన్ని ఎందుకు సృష్టిస్తాడు? ఈ ప్రశ్నలకు సమధానం చెప్పడం అంత తెలికేమి కాదు. ఇతర కళాకారులతో పోలిస్తే రచయితలకు ఈ ప్రశ్న ఎక్కువగా ఎదురవుతుంది. రచయిత నిబద్దత, నిమగ్నతలపై ప్రశ్నలు గుప్పిస్తుంటారు. మనిషి రాజకీయ అభిప్రాయాలూ, అవసరాలకు అనుగుణంగా సాహిత్యం కూడా ఉండాలన్నా ఆలోచనా విధానం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. సమాజం వర్గాలుగా విభాజితమై ఉన్నప్పుడు రచయిత ఏ వైపు ఉన్నడన్నా ప్రశ్న వేసుకుని ఒక వైపుకు పరిమితం చేసి తిరస్కరించే ప్రయత్నమూ జరుగుతుంది. పాఠకుల అభిరుచులు, అభిప్రాయాలూ కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. ఏ రచయితా పాఠకులనందరిని ఒకే విధంగా మెప్పించగలగడం అసాధ్యం. ఆధునిక తెలుగు కథా, నవలా సాహిత్యంలో తనదైన శైలితో ప్రత్యేకతను సంతరించుకున్న రచయిత శ్రీ కాకాని చక్రపాణి. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను ఆత్మీయతను బంధాలను హృద్యమైన శైలిలో రూపు దిద్దగల శిల్పి ఆయన....శ్రీ చక్రపాణి నవలలు నేల విడిచి సాము చెయ్యవు. అవి మనకు ఎంతో సుపరిచితాలనిపిస్తాయి. అవిశ్రాంతంగా సాగుతున్న ఆయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కథలు, లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు. వీటన్నిటినీ గురించి వివరించునదే ఈ గ్రంథం. -రచయిత.
© 2017,www.logili.com All Rights Reserved.