తెలంగాణా ఉద్యమంలో ఆయా వర్గాల భాగస్వామ్యం నిలబడాలంటే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఆయా వర్గాల సమస్యల వ్యక్తీకరణకు తోడ్పడాలి. తెలంగాణాలోని అన్ని సామజిక వర్గాలను కలుపుకొని రావటానికి పార్టీలు, నాయకులూ కృషి చేయడమే చాలదు, సామజిక స్థాయిలో కూడా ఆయా వర్గాల మధ్య ఐక్యతను సాధించాలి. ఆ బాధ్యత ఇక్కడి శిష్ట వర్గాల మీద కూడా ఉన్నదని శ్రీనివాస్ సూచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తెలుగుజాతి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో స్థిరపడిన కోస్తా సంపన్న వర్గాల ఆధిపత్యానికి సవాలు.
ఆ ఆధిపత్యాన్ని ఎదిరించే క్రమంలో తెలంగాణా ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుసరించిన అభివృద్ధి పంథాను కూడా తిరస్కరిస్తుంది. తన అస్తిత్వాన్ని తాని నిర్వచించుకునే క్రమంలోనే తెలంగాణా తన అవసరాలకు, పరిస్థితులకు తగినట్టి ప్రత్యామ్నాయ నమూనాను రూపొందించుకుంటున్నది. ప్రత్యామ్నాయ నమూనా విషయంలో శ్రీనివాస్ వ్యాసాల్లో ఆసక్తికరమైన ప్రతిపాదనలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలన్న ఆసక్తి కలవారికి మాత్రమే కాదు ప్రజాస్వామిక విలువలను వ్యవస్థితం చేయడానికి కృషి చేస్తున్న ప్రజాస్వామిక వాదులందరికీ శ్రీనివాస్ వ్యాసాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇంతవరకు పవిత్రంగా భావించిన విలువలు, వ్యవస్థల స్థానే ప్రత్యామ్నాయాలను వెతుక్కొంటున్న నేటి తరుణంలో శ్రీనివాస్ వ్యాసాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
- కోదండరాం
తెలంగాణా ఉద్యమంలో ఆయా వర్గాల భాగస్వామ్యం నిలబడాలంటే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఆయా వర్గాల సమస్యల వ్యక్తీకరణకు తోడ్పడాలి. తెలంగాణాలోని అన్ని సామజిక వర్గాలను కలుపుకొని రావటానికి పార్టీలు, నాయకులూ కృషి చేయడమే చాలదు, సామజిక స్థాయిలో కూడా ఆయా వర్గాల మధ్య ఐక్యతను సాధించాలి. ఆ బాధ్యత ఇక్కడి శిష్ట వర్గాల మీద కూడా ఉన్నదని శ్రీనివాస్ సూచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తెలుగుజాతి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో స్థిరపడిన కోస్తా సంపన్న వర్గాల ఆధిపత్యానికి సవాలు. ఆ ఆధిపత్యాన్ని ఎదిరించే క్రమంలో తెలంగాణా ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుసరించిన అభివృద్ధి పంథాను కూడా తిరస్కరిస్తుంది. తన అస్తిత్వాన్ని తాని నిర్వచించుకునే క్రమంలోనే తెలంగాణా తన అవసరాలకు, పరిస్థితులకు తగినట్టి ప్రత్యామ్నాయ నమూనాను రూపొందించుకుంటున్నది. ప్రత్యామ్నాయ నమూనా విషయంలో శ్రీనివాస్ వ్యాసాల్లో ఆసక్తికరమైన ప్రతిపాదనలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలన్న ఆసక్తి కలవారికి మాత్రమే కాదు ప్రజాస్వామిక విలువలను వ్యవస్థితం చేయడానికి కృషి చేస్తున్న ప్రజాస్వామిక వాదులందరికీ శ్రీనివాస్ వ్యాసాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇంతవరకు పవిత్రంగా భావించిన విలువలు, వ్యవస్థల స్థానే ప్రత్యామ్నాయాలను వెతుక్కొంటున్న నేటి తరుణంలో శ్రీనివాస్ వ్యాసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. - కోదండరాం
© 2017,www.logili.com All Rights Reserved.