దళిత ఉద్యమ యవనిక మీదికి బెబ్బులిలా దూసుకొచ్చి ప్రభంజనం సృష్టించింది- దళిత పాంథర్స్! 1972 లో మహారాష్ట్రలో పురుడు పోసుకున్న ఈ బృందం ఐదేళ్లపాటు సమకాలిన సామాజిక రాజకీయ రంగాలను ఓ ఊపు ఊపింది। దళితుల్లో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని తట్టిలేపి - కులవ్యవస్థకు వ్యతిరేకంగా ముఖ్యంగా అగ్రకుల పీడన పై ప్రతిఘటించేలా సరికొత్త స్థైర్యాన్ని నూరిపోసింది। యువతను అమితంగా ఆకట్టుకొన్న ఈ బృందం హైందవ మత భావజాలాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ దళితుల రాజ్యాంగ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం బలమైన పోరాటాన్ని నిర్మించింది। దీని అయుష్షు తక్కువే అయినా దేశంలో దళిత ఉద్యమానికి ఇది బలమైన భూమికను నిర్మించింది। పోరాటానికి అవసరమైన సైద్ధాంతిక సాధన సంపత్తిని అందించింది। వ్యవస్థలన్నింటిని గడగడలాడించింది। దీని ప్రస్థానాన్ని సమగ్రంగా మనముందు ఆవిష్కరించే రచన ఇది। అంతేకాదు నాయకత్వంలో అనైక్యత రాజీధోరణుల కారణంగా కాలక్రమంలో అదెలా నిర్వీర్యమైందో, తదనంతర పరిణామాలేమిటో కూడా అంచనా వేస్తుంది।