వివాహ శబ్ద నిర్వచనము వివాహ శబ్దములో 'వి' అనియు, 'వాహః' అనియు రెండు భాగములున్నవి. 'వి' అనుదానికి విశిష్టత అని యర్థము. 'వాహః' అనుదానికి పొందించుట అని యర్ధము.
ఈ విషయము వీరమిత్రోదయము - సంస్కార కాండలో ఇటుల విస్తరించి చెప్పబడినది.
“వివాహః | వహ ప్రాపణే ఇత్యస్మాద్దాతోః, భావే ఘజీ కృతే వహనం వాహః | విశిష్టో వాహః వివాహః | వైశిష్ట్యం చ ప్రతిగ్రహాద్యష్టవిధో పాయాన్యతమోపాయేన హోమాది సప్తపద నయనాంత కర్మాభి సంస్కృతత్వమ్ | తథా చ వివాహ పదార్డో (ద్విదల) ద్విఫల స్సిద్ధ్యతి | (1) స్వత్వోత్పాదనం (2) సంస్కారాధానం చేతి | తదేతత్ స్పష్టీకృతం పారస్కరేణ | పిత్రి ప్రత్తా మాదాయ గృహీత్వా ని మతి (1-4-15) వరం దదాతీ (1-8-14) త్యంతేన |
అనువఱకు ప్రతిగ్రహము మొదలుకొని చెప్పబడిన బ్రాహ్మాది పైశాచాన్త వివాహము లెనిమిదింటిలో నేవిధముగానైనను స్వీకరించిన కన్యతో హోమము మొదలుకొని సప్తపదివఱకు గల సంస్కారములచే సంస్కరింపబడుట అని వివాహశబ్దమున కర్థము. ఇది వివాహములో ప్రధానమని తాత్పర్యము.
వివాహము స్త్రీ పురుషులలోని అపూర్ణత్వమును తొలగించి, వారికి పూర్ణత్వ మొసగజాలిన యొక పవిత్ర సంస్కారము, స్త్రీపురుషులిర్వురు దానికి రెండు పక్షములు. ఈ రెంటిని కలిపి - అనగా ఈ యుభయ శక్తులను సమన్విత మొనర్చి, ఈ సమన్వితశక్తిని ఏకలక్ష్యోన్ముఖము సేయుటయే ఈ సంస్కారముయొక్క ముఖ్యోద్దేశ్యము. ఈ సంస్కార ప్రయోజనము కేవలము ఇహలోకమునకే పరిమితముకాక, పరలోకమునకు గూడ ప్రాప్తమై యున్నది. కేవలము శారీర - ఐంద్రియ పరితోషము మాత్రము వివాహమునకు గమ్యముగాక, కర్తవ్యపాలనము, దైవారాధనము, అతిథిపూజ, సంతానప్రాప్తి, అధ్యాత్మికోన్నతి, పారివారిక, సామాజిక శ్రేయము నిశ్రేయము దీనికి గమ్యములు (Goals) కావుననే ఇది సర్వసంస్కారములలో నుత్తమ మయినదిగాను పవిత్రమయినదిగాను ఋషులు ప్రతిపాదించినారు.
“విశేషణ వాహయతీతి వివాహః” అనగా వివాహితులయిన దంపతులకు విశేషముగా గృహస్థ ధర్మములను వహింపఁజేయు సంస్కార విశేషమునకు వివాహము అని పేరు (చెప్పినారు). దీనికి పాణిగ్రహణమని వ్యవహారము గలదు. ఈ సంస్కార విశేషము ప్రత్యక్ష ప్రయోజనము, పరోక్ష ప్రయోజనము ఉభయప్రయోజనము నయి యున్నది. ఇట్టి ప్రయోజనములతోగూడిన సంస్కార జనక క్రియా కలాపము వివాహమని సారాంశము.
వివాహ శబ్ద నిర్వచనము వివాహ శబ్దములో 'వి' అనియు, 'వాహః' అనియు రెండు భాగములున్నవి. 'వి' అనుదానికి విశిష్టత అని యర్థము. 'వాహః' అనుదానికి పొందించుట అని యర్ధము. ఈ విషయము వీరమిత్రోదయము - సంస్కార కాండలో ఇటుల విస్తరించి చెప్పబడినది. “వివాహః | వహ ప్రాపణే ఇత్యస్మాద్దాతోః, భావే ఘజీ కృతే వహనం వాహః | విశిష్టో వాహః వివాహః | వైశిష్ట్యం చ ప్రతిగ్రహాద్యష్టవిధో పాయాన్యతమోపాయేన హోమాది సప్తపద నయనాంత కర్మాభి సంస్కృతత్వమ్ | తథా చ వివాహ పదార్డో (ద్విదల) ద్విఫల స్సిద్ధ్యతి | (1) స్వత్వోత్పాదనం (2) సంస్కారాధానం చేతి | తదేతత్ స్పష్టీకృతం పారస్కరేణ | పిత్రి ప్రత్తా మాదాయ గృహీత్వా ని మతి (1-4-15) వరం దదాతీ (1-8-14) త్యంతేన | అనువఱకు ప్రతిగ్రహము మొదలుకొని చెప్పబడిన బ్రాహ్మాది పైశాచాన్త వివాహము లెనిమిదింటిలో నేవిధముగానైనను స్వీకరించిన కన్యతో హోమము మొదలుకొని సప్తపదివఱకు గల సంస్కారములచే సంస్కరింపబడుట అని వివాహశబ్దమున కర్థము. ఇది వివాహములో ప్రధానమని తాత్పర్యము. వివాహము స్త్రీ పురుషులలోని అపూర్ణత్వమును తొలగించి, వారికి పూర్ణత్వ మొసగజాలిన యొక పవిత్ర సంస్కారము, స్త్రీపురుషులిర్వురు దానికి రెండు పక్షములు. ఈ రెంటిని కలిపి - అనగా ఈ యుభయ శక్తులను సమన్విత మొనర్చి, ఈ సమన్వితశక్తిని ఏకలక్ష్యోన్ముఖము సేయుటయే ఈ సంస్కారముయొక్క ముఖ్యోద్దేశ్యము. ఈ సంస్కార ప్రయోజనము కేవలము ఇహలోకమునకే పరిమితముకాక, పరలోకమునకు గూడ ప్రాప్తమై యున్నది. కేవలము శారీర - ఐంద్రియ పరితోషము మాత్రము వివాహమునకు గమ్యముగాక, కర్తవ్యపాలనము, దైవారాధనము, అతిథిపూజ, సంతానప్రాప్తి, అధ్యాత్మికోన్నతి, పారివారిక, సామాజిక శ్రేయము నిశ్రేయము దీనికి గమ్యములు (Goals) కావుననే ఇది సర్వసంస్కారములలో నుత్తమ మయినదిగాను పవిత్రమయినదిగాను ఋషులు ప్రతిపాదించినారు. “విశేషణ వాహయతీతి వివాహః” అనగా వివాహితులయిన దంపతులకు విశేషముగా గృహస్థ ధర్మములను వహింపఁజేయు సంస్కార విశేషమునకు వివాహము అని పేరు (చెప్పినారు). దీనికి పాణిగ్రహణమని వ్యవహారము గలదు. ఈ సంస్కార విశేషము ప్రత్యక్ష ప్రయోజనము, పరోక్ష ప్రయోజనము ఉభయప్రయోజనము నయి యున్నది. ఇట్టి ప్రయోజనములతోగూడిన సంస్కార జనక క్రియా కలాపము వివాహమని సారాంశము.© 2017,www.logili.com All Rights Reserved.