యు.ఆర్.అనంతమూర్తి గారి 'సంస్కార' నవల మొదటిసారి చదివినప్పుడు చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను. ఆ పాత్రలు, సంప్రదాయాలు, సంస్కృతి కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన తీరు , దీనితో నన్ను మమేకం చేసింది. నే పుట్టి పెరిగిన వాతావరణం అందులో ప్రతిబింబి౦చింది. అప్పుడప్పుడు నా స్నేహితులతో జరిగే సంభాషణల్లో నా బాల్యం, మా ఆచార వ్యవహారాల గురించిన విషయాలు దొర్లేవి. ఈ నవల చదివాకా, దీన్ని నేను తెలుగులో చెప్పగలిగితే నా స్నేహితులకే కాక తెలుగు వారందరికీ కన్నడ మధ్వ బ్రాహ్మణ సంస్కృతిని గురించి తెలుసుకునే వీలుంటుంది కదా అనిపించింది. ఏకబిగిన మూడు నెలలు నవలను తెనిగించాను.
ఇలా రాస్తున్న క్రమంలో ప్రణేశాచార్యకు సంబంధించిన ప్రశ్నలు, అతని బహిరంతర ప్రయాణాలు నేను కొంత చదువుకున్న అస్తిత్వవాద సిద్ధాంతాలకు, ఆచార్యుని సందిగ్దాలు, సమస్యలు పోలి ఉండడం; కొన్ని పాత్రల మూర్ఖత్వం, స్త్రీ పాత్ర చిత్రణ నాలో కొంత అసంతృప్తిని కలిగించాయి. తెలిసిన వాతావరణం, కొంత తెలియని మనస్తత్వాలు ఇవన్నీనాలో కొన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలు, కొన్ని సంఘటనలు రచయిత ప్రణాళిక ప్రకారం 'శ్రద్ధగా' నడిపినట్టు కనిపిస్తాయి. ఇవి నన్ను కొంత ఇబ్బందికి, అసహనానికి గురిచేశాయి.
ఈ నవల కన్నడంలో 1965 లో అచ్చయింది. 1970 లో పఠాభి ఆధ్వర్యంలో చలనచిత్రంగా నిర్మితమై, ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. ఇది సినిమా గానూ, నవల గానూ వివాదాస్పదమైంది. దీనికి ప్రో.ఎ.కె.రామానుజన్ ఇంగ్లిషు లోకి అనువదించడంతో అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకుంది.
- సుజాత పట్వారి
యు.ఆర్.అనంతమూర్తి గారి 'సంస్కార' నవల మొదటిసారి చదివినప్పుడు చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను. ఆ పాత్రలు, సంప్రదాయాలు, సంస్కృతి కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన తీరు , దీనితో నన్ను మమేకం చేసింది. నే పుట్టి పెరిగిన వాతావరణం అందులో ప్రతిబింబి౦చింది. అప్పుడప్పుడు నా స్నేహితులతో జరిగే సంభాషణల్లో నా బాల్యం, మా ఆచార వ్యవహారాల గురించిన విషయాలు దొర్లేవి. ఈ నవల చదివాకా, దీన్ని నేను తెలుగులో చెప్పగలిగితే నా స్నేహితులకే కాక తెలుగు వారందరికీ కన్నడ మధ్వ బ్రాహ్మణ సంస్కృతిని గురించి తెలుసుకునే వీలుంటుంది కదా అనిపించింది. ఏకబిగిన మూడు నెలలు నవలను తెనిగించాను. ఇలా రాస్తున్న క్రమంలో ప్రణేశాచార్యకు సంబంధించిన ప్రశ్నలు, అతని బహిరంతర ప్రయాణాలు నేను కొంత చదువుకున్న అస్తిత్వవాద సిద్ధాంతాలకు, ఆచార్యుని సందిగ్దాలు, సమస్యలు పోలి ఉండడం; కొన్ని పాత్రల మూర్ఖత్వం, స్త్రీ పాత్ర చిత్రణ నాలో కొంత అసంతృప్తిని కలిగించాయి. తెలిసిన వాతావరణం, కొంత తెలియని మనస్తత్వాలు ఇవన్నీనాలో కొన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలు, కొన్ని సంఘటనలు రచయిత ప్రణాళిక ప్రకారం 'శ్రద్ధగా' నడిపినట్టు కనిపిస్తాయి. ఇవి నన్ను కొంత ఇబ్బందికి, అసహనానికి గురిచేశాయి. ఈ నవల కన్నడంలో 1965 లో అచ్చయింది. 1970 లో పఠాభి ఆధ్వర్యంలో చలనచిత్రంగా నిర్మితమై, ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. ఇది సినిమా గానూ, నవల గానూ వివాదాస్పదమైంది. దీనికి ప్రో.ఎ.కె.రామానుజన్ ఇంగ్లిషు లోకి అనువదించడంతో అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకుంది. - సుజాత పట్వారి© 2017,www.logili.com All Rights Reserved.