బౌద్ధపునరుత్థానం వేగం పుంజుకొంటోంది. 2010 నుండి 2014 సంవత్సరాల మధ్యకాలంలో ఐదు ఆంధ్రప్రదేశ్ బౌద్ధమహాసమ్మేళనాలు జరగడమే ఇందుకు నిదర్శనం. బౌద్ధ సైద్ధాంతిక గ్రంథాలు ఇవ్వాళ హితోధికంగానే వెలువడుతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 5కోట్లు ఆర్ధిక సహకారంతో బెంగళూరు మహాబోధి సొసైటి త్రిపిటకాలను తెలుగు చేయించడానికి పూనుకోవడం ముదావహం.
అయితే బుద్ధుడు చెప్పిన "అసలు విషయాలను" అర్థం చేసుకోవడానికి ఆయన ఉపయోగించిన పాలీ పారిభాషిక పదాలు పెద్ద అవరోధాలయ్యాయి. ఆ అవరోధాన్ని అధిగమించేందుకు అన్నపరెడ్డి బుద్ధగోషుని చేత "బౌద్ధ పారిభాషిక పద నిఘంటువును" రచింపజేసి వెలువరించడానికి మా ఆదుర్రు బుద్ధవిహార ట్రస్టు పూనుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దీనికి సహకరించి నిఘంటువును సకాలంలో అందించిన అన్నపరెడ్డి బుద్ధగోషునికి అభినందనలు, అభివాదాలు తెలియజేస్తున్నాం. బౌద్ధ అవగాహనకు ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ...
- ఆదుర్రు బుద్ధవిహార ట్రస్టు
బౌద్ధపునరుత్థానం వేగం పుంజుకొంటోంది. 2010 నుండి 2014 సంవత్సరాల మధ్యకాలంలో ఐదు ఆంధ్రప్రదేశ్ బౌద్ధమహాసమ్మేళనాలు జరగడమే ఇందుకు నిదర్శనం. బౌద్ధ సైద్ధాంతిక గ్రంథాలు ఇవ్వాళ హితోధికంగానే వెలువడుతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 5కోట్లు ఆర్ధిక సహకారంతో బెంగళూరు మహాబోధి సొసైటి త్రిపిటకాలను తెలుగు చేయించడానికి పూనుకోవడం ముదావహం. అయితే బుద్ధుడు చెప్పిన "అసలు విషయాలను" అర్థం చేసుకోవడానికి ఆయన ఉపయోగించిన పాలీ పారిభాషిక పదాలు పెద్ద అవరోధాలయ్యాయి. ఆ అవరోధాన్ని అధిగమించేందుకు అన్నపరెడ్డి బుద్ధగోషుని చేత "బౌద్ధ పారిభాషిక పద నిఘంటువును" రచింపజేసి వెలువరించడానికి మా ఆదుర్రు బుద్ధవిహార ట్రస్టు పూనుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దీనికి సహకరించి నిఘంటువును సకాలంలో అందించిన అన్నపరెడ్డి బుద్ధగోషునికి అభినందనలు, అభివాదాలు తెలియజేస్తున్నాం. బౌద్ధ అవగాహనకు ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ... - ఆదుర్రు బుద్ధవిహార ట్రస్టు© 2017,www.logili.com All Rights Reserved.