"పురాణ" అంటే పూర్వకాలంలో జరిగినది అని అర్థం. అయితే అతి ప్రాచీనకాలంలోది అయినా ఎప్పుడూ కొత్తగా ఉండేది అని అర్థం. పూర్వకాలంలో యిలా జరిగింది అని యిప్పుడు తెలియజేసేది. వేదాలు ఎవరిచేత రాయబడలేదు. అవి అపౌరుషేయాలు. వేల సంవత్సరాల నుండి యీ నాటికీ నిలిచి ఉన్నాయి వేదాలు. వేదాలలో మానవులు చేయవలసిన విధులు తెలియజేయబడ్డాయి. అయితే వేదాలు అందరికి సులభంగా అర్థం కావు. వాటిలో అర్థాలు నిగూడంగా ఉంటాయి. కాబట్టి సామాన్య మానవులకి కూడా అర్థమయ్యే విధంగా పురాణాలు రచింపబడ్డాయి. పురాణాల వల్లే మానవులకి వేదాలలో ఉన్న విషయాలు తెలుస్తాయి. పురాణాలకి అయిదు లక్షణాలుంటాయి. ఆదిసృష్టి, బ్రహ్మసృష్టి, రాజవంశం, ఋషివంశం, మన్వంతరాల నుండి వచ్చిన వంశాలలో గల ప్రసిద్ధి చెందిన వారి చరిత్రలు పురాణాలలో ఉంటాయి. పురాణాలలో ఉన్న కథలు నీతులు, ధర్మాలు భోదిస్తాయి.
సి. వి. యెస్. రాజు
"పురాణ" అంటే పూర్వకాలంలో జరిగినది అని అర్థం. అయితే అతి ప్రాచీనకాలంలోది అయినా ఎప్పుడూ కొత్తగా ఉండేది అని అర్థం. పూర్వకాలంలో యిలా జరిగింది అని యిప్పుడు తెలియజేసేది. వేదాలు ఎవరిచేత రాయబడలేదు. అవి అపౌరుషేయాలు. వేల సంవత్సరాల నుండి యీ నాటికీ నిలిచి ఉన్నాయి వేదాలు. వేదాలలో మానవులు చేయవలసిన విధులు తెలియజేయబడ్డాయి. అయితే వేదాలు అందరికి సులభంగా అర్థం కావు. వాటిలో అర్థాలు నిగూడంగా ఉంటాయి. కాబట్టి సామాన్య మానవులకి కూడా అర్థమయ్యే విధంగా పురాణాలు రచింపబడ్డాయి. పురాణాల వల్లే మానవులకి వేదాలలో ఉన్న విషయాలు తెలుస్తాయి. పురాణాలకి అయిదు లక్షణాలుంటాయి. ఆదిసృష్టి, బ్రహ్మసృష్టి, రాజవంశం, ఋషివంశం, మన్వంతరాల నుండి వచ్చిన వంశాలలో గల ప్రసిద్ధి చెందిన వారి చరిత్రలు పురాణాలలో ఉంటాయి. పురాణాలలో ఉన్న కథలు నీతులు, ధర్మాలు భోదిస్తాయి. సి. వి. యెస్. రాజు© 2017,www.logili.com All Rights Reserved.