పద్దెనిమిది మహాపురాణాలున్నాయి. "మహా" అంటే "గొప్ప" అని అర్థం. చాలా ఉపపురాణాలు కూడా ఉన్నాయి. "ఉప" అంటే "చిన్న" అని అర్థం. మహాపురాణాలలో మత్స్య పురాణం పదహారవది. పురాణాలకి అయిదు లక్షణాలుంటాయి. అయిదు లక్షణాలు ఉంటేనే అది మహాపురాణం అవుతుంది. అంటే అయిదు విషయాల్ని మహాపురాణం వర్ణించాలి. అయిదు లక్షణాలు ఏమంటే - 1) సర్గ - విశ్వసృష్టి క్రమం 2) ప్రతిసర్గ - ప్రళయం, పునస్సృష్టి 3) శకాలు - మన్వంతరాలు 4) సూర్యవంశ చరిత్ర 5) రాజవంశీయుల చరిత్రలు - వంశానుచరితలు. మత్స్య పురాణానికి యీ అయిదు లక్షణాలు ఉన్నాయి. ప్రాచీన విషయాల్ని గురించి వివరించేది పురాణం. పురాణం అంటేనే పురాతనం, ప్రాచీనం అని అర్థం. అయితే ప్రాచీన విషయాల్ని గురించి చెప్పినా, సమకాలిన విషయాల్ని గురించి చెప్పినట్లుగానే ఉంటుంది. పురాణాలలో ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పబడతాయి. ధర్మాలంటే వేదాలలో చెప్పబడిన ధర్మాలు. పురాణానికి అయిదు లక్షణాలు ఉంటాయి. పురాణాలు భారతీయ విజ్ఞాన కోశాలు. వాటిలో ఉన్న నీతులు అందరూ తెలుసుకొని ఆచరించాలి.
- సి. వి. యెస్. రాజు
పద్దెనిమిది మహాపురాణాలున్నాయి. "మహా" అంటే "గొప్ప" అని అర్థం. చాలా ఉపపురాణాలు కూడా ఉన్నాయి. "ఉప" అంటే "చిన్న" అని అర్థం. మహాపురాణాలలో మత్స్య పురాణం పదహారవది. పురాణాలకి అయిదు లక్షణాలుంటాయి. అయిదు లక్షణాలు ఉంటేనే అది మహాపురాణం అవుతుంది. అంటే అయిదు విషయాల్ని మహాపురాణం వర్ణించాలి. అయిదు లక్షణాలు ఏమంటే - 1) సర్గ - విశ్వసృష్టి క్రమం 2) ప్రతిసర్గ - ప్రళయం, పునస్సృష్టి 3) శకాలు - మన్వంతరాలు 4) సూర్యవంశ చరిత్ర 5) రాజవంశీయుల చరిత్రలు - వంశానుచరితలు. మత్స్య పురాణానికి యీ అయిదు లక్షణాలు ఉన్నాయి. ప్రాచీన విషయాల్ని గురించి వివరించేది పురాణం. పురాణం అంటేనే పురాతనం, ప్రాచీనం అని అర్థం. అయితే ప్రాచీన విషయాల్ని గురించి చెప్పినా, సమకాలిన విషయాల్ని గురించి చెప్పినట్లుగానే ఉంటుంది. పురాణాలలో ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పబడతాయి. ధర్మాలంటే వేదాలలో చెప్పబడిన ధర్మాలు. పురాణానికి అయిదు లక్షణాలు ఉంటాయి. పురాణాలు భారతీయ విజ్ఞాన కోశాలు. వాటిలో ఉన్న నీతులు అందరూ తెలుసుకొని ఆచరించాలి. - సి. వి. యెస్. రాజు© 2017,www.logili.com All Rights Reserved.