ప్రతి యువకునికి ఈ ప్రశ్న జీవితంలో సమాధానం సాధించవలసిన అవసరం ఉంది. పెళ్లి నూరేళ్ళపంట. ఇరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆకలిడదప్పులు, మనసు - తల్లి తెలుసుకుంటుంది. తల్లి చాటు నుంచి బయటపడిన యువకుడు తన స్వంత ఊహలకు రూపకల్పన చేసుకోవడానికి భార్యమీద ఆధారపడతాడు. గొప్పగొప్ప వారందరికీ భార్యల సహకారమే లేకపోతే వారు అందరిలా మామూలుగానే వుండేవారు. జీవితంలో భాగస్వామిగా ఎన్నుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోగల అనుభవం కాని, ఊహాపరిజ్ఞానముకాని యువకులకు ఉండదు.
వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్లి చెయ్యాలని అనేవారు. అనేక వ్యక్తిగత కారణాల వాళ్ళ పెళ్లికూతురి గురించి నచ్చచెప్పేవాళ్ళు ఆత్మీయుల్లోనూ, స్నేహితుల్లోనూ వుంటారు. అంతవరకూ ఏమీ ఆలోచించని యువకుడు ఎవరి అభిప్రాయానికో అనుకోకుండా తలవొగ్గి తనను అందరూ మోసం చేశారని బాధపడేవాళ్ళు కొందరు. యవ్వనోద్రేకంతో ప్రేమ అని, ఆదర్శాలని ఉద్రేకంతో వివాహ సమస్యను పరిష్కారము చేసుకొని, ఉద్రేకము చల్లారిన తరువాత జీవితాంతము బాధ పడుతుంటారు. అందుకే ఈ పుస్తకం!
ప్రతి యువకునికి ఈ ప్రశ్న జీవితంలో సమాధానం సాధించవలసిన అవసరం ఉంది. పెళ్లి నూరేళ్ళపంట. ఇరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆకలిడదప్పులు, మనసు - తల్లి తెలుసుకుంటుంది. తల్లి చాటు నుంచి బయటపడిన యువకుడు తన స్వంత ఊహలకు రూపకల్పన చేసుకోవడానికి భార్యమీద ఆధారపడతాడు. గొప్పగొప్ప వారందరికీ భార్యల సహకారమే లేకపోతే వారు అందరిలా మామూలుగానే వుండేవారు. జీవితంలో భాగస్వామిగా ఎన్నుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోగల అనుభవం కాని, ఊహాపరిజ్ఞానముకాని యువకులకు ఉండదు. వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్లి చెయ్యాలని అనేవారు. అనేక వ్యక్తిగత కారణాల వాళ్ళ పెళ్లికూతురి గురించి నచ్చచెప్పేవాళ్ళు ఆత్మీయుల్లోనూ, స్నేహితుల్లోనూ వుంటారు. అంతవరకూ ఏమీ ఆలోచించని యువకుడు ఎవరి అభిప్రాయానికో అనుకోకుండా తలవొగ్గి తనను అందరూ మోసం చేశారని బాధపడేవాళ్ళు కొందరు. యవ్వనోద్రేకంతో ప్రేమ అని, ఆదర్శాలని ఉద్రేకంతో వివాహ సమస్యను పరిష్కారము చేసుకొని, ఉద్రేకము చల్లారిన తరువాత జీవితాంతము బాధ పడుతుంటారు. అందుకే ఈ పుస్తకం!© 2017,www.logili.com All Rights Reserved.