తెలంగాణ సాహితి
రాగసుధా భరితం సముద్రాల పాట
“రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా " అనే పాటను పాడగానే మనకు తెలియకుండానే భక్తి భావన మనలో ఉప్పొంగి పోతుంది. ఈ పాట 1963వ సంవత్సరం "లవకుశ” చిత్రం లోనిది. రామాయణం మొత్తం కేవలం నాలుగు పాటల్లోనే చూపించిన గొప్ప రచయిత సముద్రాల రాఘవాచార్యులు. సినిమారంగంలో సీనియర్ సముద్రాలగా అందరికీ సుపరిచితులు. సీనియర్ సముద్రాల అసలు పేరు సముద్రాల వేంకట రాఘవాచార్యులు. గుంటూరు జిల్లా రేపల్లె పెద్దపులివర్రు గ్రామంలో 1902వ సంవత్సరం జూలై 18న జన్మించారు. తొమ్మిదవ తరగతిలోనే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. "శశిరేఖ పరిణయం” సినిమాలో కొన్ని సన్నివేశాలు రాయడంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమా రచయితగా, దర్శకుడిగా, నేపథ్యగాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు సముద్రాల. మచ్చుకు వారి కొన్ని సినిమా పాటలు ఇక్కడ పరిశీలిద్దాం.
సీనియర్ సముద్రాల మొదటి సినిమా "కనకతార"1937లో వచ్చింది. (చందాల కేశవదాసు ప్రసిద్ధ నాటకం) ఈ సినిమాకు పాటలు రాయడంతో సముద్రాల సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో మొత్తం 12 పాటలు, ఏడు పద్యాలను సముద్రాల వారే రాశారు.
“కానరా మానరా హింస మానరా
భువన మాతా బలుల చేత భోగములియగబోదేనాడు కానరా మానరా హింస మానరా! కనరా భక్తి కనరా ముక్తి"
తెలంగాణ సాహితి రాగసుధా భరితం సముద్రాల పాట “రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా " అనే పాటను పాడగానే మనకు తెలియకుండానే భక్తి భావన మనలో ఉప్పొంగి పోతుంది. ఈ పాట 1963వ సంవత్సరం "లవకుశ” చిత్రం లోనిది. రామాయణం మొత్తం కేవలం నాలుగు పాటల్లోనే చూపించిన గొప్ప రచయిత సముద్రాల రాఘవాచార్యులు. సినిమారంగంలో సీనియర్ సముద్రాలగా అందరికీ సుపరిచితులు. సీనియర్ సముద్రాల అసలు పేరు సముద్రాల వేంకట రాఘవాచార్యులు. గుంటూరు జిల్లా రేపల్లె పెద్దపులివర్రు గ్రామంలో 1902వ సంవత్సరం జూలై 18న జన్మించారు. తొమ్మిదవ తరగతిలోనే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. "శశిరేఖ పరిణయం” సినిమాలో కొన్ని సన్నివేశాలు రాయడంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమా రచయితగా, దర్శకుడిగా, నేపథ్యగాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు సముద్రాల. మచ్చుకు వారి కొన్ని సినిమా పాటలు ఇక్కడ పరిశీలిద్దాం. సీనియర్ సముద్రాల మొదటి సినిమా "కనకతార"1937లో వచ్చింది. (చందాల కేశవదాసు ప్రసిద్ధ నాటకం) ఈ సినిమాకు పాటలు రాయడంతో సముద్రాల సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో మొత్తం 12 పాటలు, ఏడు పద్యాలను సముద్రాల వారే రాశారు. “కానరా మానరా హింస మానరా భువన మాతా బలుల చేత భోగములియగబోదేనాడు కానరా మానరా హింస మానరా! కనరా భక్తి కనరా ముక్తి"© 2017,www.logili.com All Rights Reserved.