సావిత్రి నాతో కలసి నటించిన మిస్సమ్మ, గుండమ్మకథ, రక్తసంబంధం, ఉమ్మడికుటుంబం, కోడలు దిద్దిన కాపురం, మాయాబజార్ మొదలైన చిత్రాలలో ఆమె నటించిందీ అనేదానికన్నా ఆ పాత్రలకే ఆమె పుట్టిందా అన్నంత మహోత్కృష్టంగా ఆ పాత్రలను పోషించిన మాహానటి సోదరి సావిత్రి. ఈ విషాదవార్త నాలో అంధకారంలా ముసురుకుంది. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతినివ్వాలని కోరుతున్నాను.
- ఎన్. టి. రామారావు
సావిత్రి గురించి ఏం చెప్పాలన్న నాకు మాటలు రావు. ఎందుకంటే సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగా, నటిగా నేనెంతగానో ఇష్టపడే మనిషి సావిత్రి. మనం కొందరిని వ్యక్తులుగా గౌరవిస్తాం. వాళ్ల నటన మనకు నచ్చకపోవచ్చు. మరికొందరిని నటులుగా గౌరవిస్తాం. వారి వ్యక్తిత్వాలు మనకు నచ్చకపోవచ్చు. కానీ సావిత్రిని తక్కెటలో పెట్టి తూస్తే వ్యక్తిగా మంచిదా, నటిగా గొప్పదా అన్నది చెప్పలేం. సావిత్రి మనిషిగా ఎంతో మంచితనాన్ని, నటిగా గొప్ప నటనని మనకు మిగిల్చిపోయింది.
- అక్కినేని నాగేశ్వరరావు

Features
: Mahanati Savithri Vendi Terepai Vennela Santhakam